రాష్ట్రీయం

ధర్నాచౌక్‌పై ఆంక్షలు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌పై ప్రభుత్వ విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్ల నేతలు పోలీసు అనుమతితో ధర్నాలు చేసుకోవచ్చునని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ధర్నా చౌక్ వద్ద 6 వారాల పాటు ధర్నాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ధర్నా చౌక్ ఎత్తివేతపై ప్రభుత్వం ఏడాదిగా వివరణ ఇవ్వకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియచెప్పే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందన్న అంశం ప్రభుత్వానికి తెలియదా అంటూ కోర్టు ప్రశ్నించింది. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుతో పాటు ప్రొఫెసర్ విశే్వశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉమ్మడి హైకోర్టు ప్రధాన జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుపై హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు.