రాష్ట్రీయం

సెంటిమెంట్ ఆలయం.....కోనాయిపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 13: సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆల యం భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై సెంటిమెంట్ ఆలయంగా విరాజిల్లుతోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దైవభక్తి, సెంటిమెంట్లు మెండుగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఏ శుభకార్యం తలపెట్టినా కోనాయిపల్లి వెంకన్న నిస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 14న బుధవారం కేసీఆర్ గజ్వేల్ శాసనసభకు నామినేషన్ వేయనున్న సందర్భంగా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు జరపి ఆశీర్వచనం తీసుకోనున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 1985 సంవత్సరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సందర్భంగా నంగునూర్ మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసిన ఆనంతరం ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించిన కేసీఆర్ వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2001లో కేసీఆర్ టీడీపీ రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలోసైతం కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆనంతరం కోనాయిపల్లి నుండి హైదరాబాద్ వరకు కాన్వాయ్‌తో తరలివెళ్లి జల దృశ్యంలో తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, కరీంనగర్ ఎంపీగా, మహబూబ్‌నగర్‌గా ఎంపీగా, 2014 ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసిన సందర్భంలో సైతం కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని ఎన్నికల్లో విజయం సాధించాడు. సీఎం కేసీఆర్ ఏ శుభకార్యక్రమమైనా తన ఇష్టదైవమైన కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది.
మామ బాటలో అల్లుడు
2004 అక్టోబర్ ఉప ఎన్నికల్లో తన్నీరు హరీష్‌రావు మంత్రి హోదాలో తొలిసారిగా బరిలో దిగినప్పుడు తన మామ కేసీఆర్ సెంటిమెంట్ దేవాలయాన్ని గౌరవిస్తూ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. 2004, 2008, 2009, 2010, 2014లో జరిగిన ఎన్నికల్లో హరీష్‌రావు వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించారు. అప్పటి నుండి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 14న హరీష్‌రావు నామినేషన్ వేయనున్న సందర్భంగా వెంకన్న స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
కేసీఆర్ రాక కోసం విస్తృత ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం శాసన సభ ఎన్నికలకు నానినేషన్ వేస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ కోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అలాగే, రోడ్డు మార్గాన వచ్చేందుకు వీలుగా సైతం ఏర్పాట్లు చేశారు. శ్రీనివాసుడి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం, శుక్ల పక్షం సప్తమి దివ్యమైన ముహూర్తం మధ్యాహ్నం 2.34 గంటలకు కేసీఆర్ గజ్వేల్, మంత్రి హరీష్‌రావులు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10-40 గంటలకు కోనాయిపల్లికి కేసీఆర్ చేరుకొని, నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆనంతరం గ్రామస్థులతో కొద్దిసేపు ముచ్చటించనున్నారు. ఆనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్ తిరిగి వెళ్లనున్నారు. మంత్రి హరీష్‌రావు సిద్దిపేటకు వచ్చి అదే ముహూర్తానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. పోలీసు యంత్రాంగం విస్తృతమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. కేసీఆర్ రాకకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.