ఆంధ్రప్రదేశ్‌

కాకినాడలో లాజిస్టిక్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: రాష్ట్రంలో వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. 2020 నాటికి వౌలిక సదుపాయాల రంగంలో దేశంలోనే నెంబర్ ఒన్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో 150 ఎకరాల్లో ఇంధన వర్శిటీ, కాకినాడలో 90 ఎకరాల్లో లాజిస్టిక్ వర్శిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వౌలిక ప్రాజెక్టులపై ఉన్నత స్ధాయి సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో పైన పేర్కొన్న ఈ రెండు వర్శిటీలకు సలహా బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. లాజిస్టిక్ వర్శిటీకి సంబంధించి సలహా బోర్డులో రైల్వే, ఎయిర్ పోర్ట్, పోర్టు, ఇన్‌ల్యాండ్, వాటర్ వేస్ రంగాల్లో నిపుణులను ఎంపిక చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న స్ధానిక విమానాశ్రయాల కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇంధన రంగంలో రానున్న 9 ముఖ్య ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. గాలివీడులో 500 మెగావాట్లు, మైలవరంలో 1000 మెగావాట్లచొప్పున సౌర విద్యుత్ పార్కులను నెలకొల్పనున్నారు. విశాఖపట్నం జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపిసి ఆధ్వర్యంలో చేపట్టిన సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై బహిరంగ విచారణ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందన్నారు. వ్యర్ధాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్లను 12 జిల్లాల్లో 10 క్లస్టర్లుగా నెలకొల్పనున్నారు. దీనికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయింది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు యూనిట్ ఒక్కింటికీ రూ. 6.165 నుంచి రూ. 7.50 పైసలు చొప్పున టారిఫ్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ. 149 కే 15 ఎంబిపిఎస్ వేగంతో అందిస్తున్న బ్రాడ్ బ్యాండ్ సేవల వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారనే సమాచారం వస్తోందని అధికారులు తెలిపారు. ఫైబర్ కేబుల్ ట్రిపుల్ ప్లే డివైస్‌ను విద్యుత్ రీడింగ్, గ్యాస్ మీటర్లకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్లోటింగ్ స్టోరేజ్, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌కు సంబంధించి పర్యావరణ అనుమతి మంజూరు చేస్తూ కేంద్రం లేఖ పంపిందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు.