రాష్ట్రీయం

మార్పునకు ఓటే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, నవంబర్ 14: ఓటు అనే ఆయుధంతో రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రజలు సహకరించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన వద్ద వేల కోట్లు లేవని, ఆడపడుచులు, అన్నదమ్ముల ప్రేమ, జనసైనికుల అండ ఉందన్నారు. ప్రజలు ఓటు వేయడానికి ఉపయోగించే వేలుతోనే వేల కోట్ల అవినీతిపరులను ఓడించాలన్నారు. వేల కోట్ల పిచ్చి పట్టిన చంద్రబాబుకు, జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుతో ఏం చేసుకుంటారో తనకు అర్థం కావడంలేదన్నారు. చొక్కా, పంచెతో ఇంటి నుండి వచ్చిన తనకు డబ్బుపై ఆశలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం జిమామిడాడ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యిందని, అవినీతి ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయిందన్నారు. చిన్నపాటి స్కూటర్ వేసుకొచ్చిన కన్నబాబు లాంటి వారు ఎమ్మెల్యే అయ్యి అవినీతితో వంద కోట్లు సంపాదించారన్నారు. ఇలాంటి అవినీతిమయ రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం సాగించాలన్నారు. దేశంలో కులాల కోసం, మతాల కోసం మాట్లాడే పార్టీలున్నాయి తప్ప దేశం కోసం మాట్లాడే పార్టీలు లేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన బహిరంగ సభల్లో మువ్వనె్నల జెండా చూస్తే తన హృదయం ఉప్పొంగుతుందన్నారు. భరతజాతి మొత్తం కులాలు, మతాలకు అతీతంగా ఎంతో కష్టపడి ఈ మువ్వనె్నల జెండాను సాధించుకున్నామని అంతా గుర్తుంచుకోవాలన్నారు. ఏ కులంలో పుట్టినా అన్ని కులాలను సమానంగా చూసే విజ్ఞత ఉండాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎస్సీలపై ఎంతో ప్రేమ ఒలకబోసే విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ ఎస్టేట్‌లో అసైన్డ్ భూములు ఎలా కలిపేసుకున్నారని ప్రశ్నించారు. వంతాడలో మైనింగ్‌పై, కేపీఆర్ కాలుష్యంపై ఎందుకు అసెంబ్లీలో మాట్లాడరని ప్రశ్నించారు. తిత్లీ తుపాను వస్తే శ్రీకాకుళం వెళ్లకుండా కోడి కత్తి గుచ్చుకుందని హైదరాబాద్ వెళ్లిపోవడం విపక్ష నేతకు సమంజసమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లకు దాతృత్వానికి మారుపేరైన డొక్కా సీతమ్మ పేరు పెట్టవచ్చుకదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రతీ పథకానికి వారి పేర్లు పెట్టుకోవడానికి జేబులో డబ్బుతో పెడుతున్నారా, హెరిటేజ్ పాలు అమ్మి ఏమైనా పెడుతున్నారా అని ప్రశ్నించారు.
తొమ్మిది నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావాలా, ఊసరవెల్లి తరహాలో రోజుకో మాట చెప్పే చంద్రబాబునాయుడు కావాలా, మాటపై నిలబడే పవన్ కళ్యాణ్ కావాలో 2019 ఎన్నికల్లో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ప్రజలకు పాతిక కిలోల బియ్యం కాకుండా పాతికేళ్ల భవిష్యత్తును ఇస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. వరి కంకులు సాక్షిగా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మూసేసిన సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామని పవన్ కళ్యాణ్ భరోసాయిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.