రాష్ట్రీయం

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 14: దశాబ్దాలుగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన తెరాసను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ముసుగులో ఒక్కటైనాయని, విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వాటి ఆటలను సాగనీయరని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం రాత్రి ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానాన్ని దర్శించి, ప్రత్యేక పూజాదికాలలో పాల్గొన్న అనంతరం పాత్రికేయుల సమావేశంలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి అడ్డుగా నిలిచిన టీడీపీ అధినేత, కాంగ్రెస్‌తో కలిసి మళ్ళీ తెలంగాణ ప్రగతిని అడ్డుకునే లక్ష్యంతో వెనక ద్వారం నుండి ప్రవేశింప చూస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కొత్త కుట్రలను నిలువరించకుంటే బంగారు తెలంగాణను చూడలేమన్నారు. పిఎం మోదీతో చెట్టపట్టాలేసుకుని, హైకోర్టును, ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు నైజం ప్రజలకు తెలియనిది కాదన్నారు. కేసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించకుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించే వీలుండేదా అని ప్రశ్నించారు. 135 ఏళ్ళ జాతీయ పార్టీ, తమ అభ్యర్థుల జాబితాను పట్టుకుని, హైదరాబాద్ రావాల్సింది పోయి అమరావతికి వెళ్ళి, బాబు ఆమోద ముద్ర వేయించు కోవడంలోని దౌర్భాగ్యం ప్రజలకు అర్థమవుతున్నదని, వార్ వన్‌సైడేనని వారికీ తెలునన్నారు. ధర్మపురి నారసింహుడు తెలంగాణకు కొంగుబంగారమైన దైవమని, ఆయన సేవా భాగ్యం ఈశ్వర్‌కు కలగడం పురాకృత సుకృతమన్నారు. ఈశ్వర్ లాంటి కార్యదీక్షాదక్షులు ధర్మపురికి, తెరాసకు దొరకడం అదృష్టమన్నారు. ఆయనలోని సహనశీలత్వం, ఓర్పు, నేర్పు, తనకు నచ్చిన గుణాలని, రాష్ట్రంలో అత్యధికంగా సిఎం రిలీఫ్‌ఫండు పొందినది ధర్మపురి యని, అందుకు ఈశ్వర్ అభినందనీయుడన్నారు. అలాంటా నాయకుని మళ్ళీమళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం అనివార్యమన్నారు. మాజీ చీఫ్‌విప్ ఈశ్వర్, తెరాస జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్, ధర్మపురి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.