రాష్ట్రీయం

ఐహబ్‌గా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: విద్యా పరంగా విశాఖను ఐ హబ్ (ఇంటిలిజెంట్ గ్లోబల్ హబ్)గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యునెస్కో, మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) సంయుక్తంగా మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న ఎడ్యు టెక్-2018ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డిజిటల్ లెర్నింగ్ గేమ్స్ వంటి బోధన పద్ధతులు అమల్లోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు మేథావులుగా తయారవుతారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి సంస్థను ఒకేచోటకు తీసుకువచ్చేందుకు ఐ హబ్ ప్రధాన వేదిక కానుందన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకునే పరిస్థితులు రావాల్సి ఉందన్నారు. బోధన, నేర్పరితనంలో కొత్త విధానాలు, పోకడలు అనుసంధానం చేసుకోవాల్సి ఉందని, అప్పుడే విదాయ ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. పుస్తకాల భారం పెరుగుతోందని, ఈ తరుణంలో ఉల్లాసవంతమైన విద్యాబోధన అవసరమన్నారు. విద్యార్థులు తమ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆట,పాటల ద్వారా విద్యను అలవర్చుకు విధానం రావాలన్నారు. సంతోషంతో గడిపేవారిలో జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా సమాజానికి మేలు చేకూరుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం, బోధన పద్ధతులు పాటిస్తున్న ఫిన్లాండ్ దేశంతో సమానంగా రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ విద్యా రంగంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని, అన్నింటా సాంకేతికత ప్రాధాన్యత పెరుగుతుందన్నారు.
థియరీతో కొనసాగే విద్య వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యా విధ్యావిధానం కూడా అలాగే ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన విద్యాబోధన జరుగుతున్నప్పటికీ డిగ్రీలు సాధించి వస్తున్న వారిలో వృతి నైపుణ్యత లోపిస్తోందన్నారు. తిరిగి పరిశ్రమలు పట్ట్భద్రులకే మరోసారి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. భవిష్యత్‌లో మార్పులు ఊహకందనివిగా ఉంటాయని, వాటిని ముందుగానే గుర్తించి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ సాగిపోవాలన్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ పాతను వదిలేయాలని సూచించారు.ప్రభుత్వ పరంగా విద్యారంగంలోను, బోధన తదితర అంశాల్లో సరికొత్త మార్పులు తీసుకురానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. అత్యుత్తమ విద్యాబోధనా విధానాన్ని అమలు చేస్తామని, వర్చువల్ రియాలిటీ ద్వారా విద్యార్థులు తాము స్వయంగా పొందే అనుభూతితో నేర్చుకునే అంశాలు మంచి ఫలితాలిస్తాయన్నారు. చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థులు ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉండకూడదన్నారు. గతేడాది కూడా విశాఖలో ఎడ్యుటెక్ 2017 నిర్వహించామని, ఈ సారి సదస్సులో వచ్చే సూచనలు, సలహాలు (రికమండేషన్స్)పై చర్చించి వాటిని అమలు చేస్తామన్నారు.
ప్రభుత్వ పరంగా తాము తీసుకున్న చర్యలు రాష్ట్భ్రావృద్ధిని రెట్టింపు వేగవంతం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, వ్యవసాయ రంగంలో 17 శాతం వృద్ధి రేటు సాధించగలిగామన్నారు. వ్యవసాయంలో ఆక్వా, సెరీ కల్చర్, హార్టీకల్చర్, పశుసంవర్ధకం వంటి శాఖలు అనుసంధానం చేయడం ద్వారా ఈ వృద్ధిరేటు సాధించగలిగామన్నారు. ఎడాది ప్రాంతంగా పిలవబడే అనంతపురం జిల్లాలో రెండున్నర రెట్లు వృద్ధిరేటు సాధించడంలో సాంకేతికత వినియోగం కీలకమన్నారు. యునెస్కో, ఎంజీఈఐపీ డైరెక్టర్ అనంత్ దొరయ్యప్ప మాట్లాడుతూ విద్యావిధానంలో మార్పుతోనే నాణ్యమైన విద్యను అందించగలమన్నారు. సాంకేతికత, నైపుణ్యత కలిగిన విద్యార్థు లను అందించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమం, వైద్య విద్య శాఖల మంత్రి కిడారి శ్రవణ్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యిదర్శి ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.