రాష్ట్రీయం

కొత్త భూసేకరణ చట్టం దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 15: కొత్త భూసేకరణ చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేసి రైతులకు అన్యాయం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రైతులను నష్టపరిచారని దుయ్యబట్టారు. భూసేకరణ చట్టం విషయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొందూ దొందేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు హామీ పత్రాలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాష్ట్రంలో వంశధార నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వరకు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం హామీ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే రైతులకు హామీ పత్రాలు ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాచేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. కేజీ బేసీన్‌లో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలున్నాయని, అందుకే ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామన్నారు. నాణ్యమైన విద్య కోసం జనసేన ఒక బలమైన విద్యా విధానాన్ని రూపొందిస్తుందన్నారు.
2019 ఎన్నికలు చాలా కీలకమని, భవిష్యత్తును నిర్ధేశించే ఎన్నికలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమ్ముకోకుండా ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ సీఎం..సీ ఎం అని సభల్లో నినాదాలు చేస్తే చాలదని, ఓటును బలంగా బ్యాలెట్ బాక్సులో గుద్దితేనే సీఎం అవుతానని గుర్తించాలన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం సాగించడం జనసేన సిద్ధాంతమన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదం బీజేపీ పేటెంట్ కాదని, భారతీయులంతా ఆ నినాదాన్ని చేయాలన్నారు. జాతీయ జెండాను మోసే నైతిక బలం టీడీపీకి, వైసీపీకి లేదని, ఆ బలం ఒక్క జనసేనకు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ కుదేలయ్యేలా, టీడీపీ కోటలు బీటలు వారేలా, వైసీపీ పారిపోయేలా భారత్ మాతాకీ జై అంటూ నినదించాలని పవన్ పిలుపునిచ్చారు.

ఏపీ నుండి టీడీపీని తన్ని తరిమేయండి
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన పార్టీ నేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి బానిసత్వాన్ని ప్రదర్శించారని పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో అంటకాగుతున్న తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుండి తన్ని తరిమేయ్యాలని పవన్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేన లేకపోతే టీడీపీ అధికారంలోకి వస్తుందా, లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి కాగలరా అని ప్రశ్నించారు.
అవినీతి రాజకీయ నాయకులను తన్ని తరిమేసి, బాధ్యత గల జవాబుదారి నూతన సమాజాన్ని తీసుకొద్దామని పవన్ పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాలు వచ్చే స్కిల్ డవలప్‌మెంట్‌ను కల్పించాలన్నారు. కీలకమైన విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాల్సింది పోయి నారాయణ వంటి కార్పొరేట్ల చేతిలో ఉండటం దారుణమన్నారు.
ఆడపడుచులు కోరుకుంటే రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధాన్ని విధించేందుకు జనసేన ఆలోచన చేస్తోందన్నారు. డెబ్బై శాతం మహిళలు కోరుకుంటే నియోజకవర్గాల్లో ఎక్కడా మద్యం, బెల్ట్‌షాపు, సారా లేకుండా చేస్తామన్నారు. ఒకవేళ సంపూర్ణ మద్య నిషేధం విధించినా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాతో మాఫియా పెరిగిపోతుందన్నారు. అందుకే అంచెలవారీ మద్య నిషేధానికి జనసేన బాధ్యత తీసుకుంటుందన్నారు. తాగి తందనాలాడి ఆడబడుచుల జీవితాలతో చెలగాటమాడే తాగుబోతుల వీరంగానికి కళ్ళెంవేస్తుందన్నారు. విచక్షణా రహితంగా, నిబంధనలకు విరుద్ధంగా చర్చిల వద్ద, మసీదుల వద్ద, ఆలయాల వద్ద మద్యం దుకాణాలు పెడుతున్నా ప్రతిపక్ష నేత జగన్ పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.