రాష్ట్రీయం

సరదాగా విద్యాబోధన.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: విద్యా బోధన శిక్షణగా కాకుండా సరదాగా సాగాలని, అటువంటి బోధనా పద్ధతులు విద్యా విధానంలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యునెస్కో, ఎంజీఐఈపీ సంయుక్తంగా మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న ఎడ్యుటెక్-2018 సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గేమింగ్, డిజిటల్ లెర్నింగ్‌ను బోధనలో భాగం చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ రాజ్యమేలుతాయని, విద్యార్థులకు ఇప్పటినుంచి ఆ దిశలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. క్రియేటివ్, డిజిటల్, వర్చువల్ తరగతుల ద్వారా బోధన మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయిలోనే విద్యాబోధన చేసే అనుభూతి పొందుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 డిజిటల్ తరగతులు, మరో 4000 వర్చువల్ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే వర్చువల్ తరగతుల నిర్వహణలో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడు బోధకునిగా ఉంటే ఇప్పుడు విద్యార్థులే ఉపాధ్యాయులను మించి సాంకేతికతను వినియోగిస్తున్నారన్నారు. సరికొత్త ఆలోచనలు అందిపుచ్చుకుంటూనే ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కంటెంట్ కార్పొరేషన్ ద్వారా మేథావులు, యువత ఇచ్చే అత్యుత్తమ ఆలోచనలను తీసుకుంటామని, మీ ఆలోచనల్ని మార్కెంటింగ్ చేస్తూ అద్భుత అవకాశాలకు దారిచూపుతామని భరోసానిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అవినీతి రహిత పాలనలో మూడో స్థానంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రకృతి వ్యవసాయానికి పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆరు లక్షల మంది రైతులు, ఆరు లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. నాణ్యతతో కూడిన సేవలందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో జోడించామని, మంచి ఫలితాలు రాబడుతున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, ఒక్క స్మార్ట్ఫోన్ ఉంటే ఇంట్లోంటే అన్ని సేవలు పొందేలా పాలనలో సంస్కరణలు తెచ్చామన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలన్నారు. బ్లాక్ బోర్డుపై విద్యాబోధన స్థానే డిజిటల్ బోధన అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా 15 లక్షల తరగతి గదులను డిజిటల్ క్లాస్ రూంలుగా తీర్చిదిద్దామన్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా పాలసీని రూపకల్పన చేస్తున్నామని, త్వరలోనే పాలసీని అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా, విజ్ఞాన కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సరికొత్త విధానాలను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. డిజిటల్ లెర్నింగ్, గేమింగ్ వంటి విధానాల ద్వారా విద్యాబోదన విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ వైజాగ్ ఎడ్యుటెక్ డిక్లరేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్‌కు, ఫెడగోగీస్‌కు మార్గదర్శకం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యునెస్కో, ఎంజీఐఈపీ తరపున కిర్గిస్తాన్ మాజీ అధ్యక్షురాలు రోజా ఒతుబయేవి ప్రారంభోపన్యాసం చేస్తూ విద్యా విధానంలో మార్పుల కోసం యునెస్కో ఎంతో చేస్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాబోయే తరానికి అవసరమైన విద్యా విధానం అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల బోధనా తీరులో విప్లవాత్మక మార్పులు అవసరమన్నారు. పరస్పర సహకారంతో సాంకేతిక మార్పిడి ద్వారా లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ సందర్భంగా మూడు ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకోగా, మరోమూడు ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. శ్యామ్‌సంగ్ మైడ్రీమ్ ప్రాజెక్టు, డిజైన్ యూనివర్శిటీ ఏర్పాటు, స్కిల్లింగ్ ప్రోగ్రాం ఆన్ క్రియేటివ్ డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టులను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎడ్యుటెక్ 2018ని పురస్కరించుకుని గేమ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ హేకథాన్ ఛాలెంజ్ విజేతలకు సీఎం చంద్రబాబు చెక్కులు బహుకరించారు. తెలుగులో తొలి గ్లోబల్ యూనివర్శల్ యాప్‌ను, యునెస్కో-ఎంజీఐఈపీ అభివృద్ధి పరచిన ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం, కలెక్టివ్ హ్యూమన్ ఇంటిలిజెన్స్‌ను కార్యక్రమాన్ని ప్రారంభించారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ సందేశాన్ని యునెస్కో, ఎంజీఐఈపీ డైరెక్టర్ అనంత దొరయ్యప్ప చదవి వినిపించారు. సమావేశంలో మంత్రులు చినరాజప్ప, కె శ్రావణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.