రాష్ట్రీయం

‘కూటమి’ కుట్రలకు లొంగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 15: స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జతకట్టిన మహాకూటమిని అధికారంలోకి తెస్తే అభివృద్ధి బాటలో పయనిస్తున్న తెలంగాణను మళ్లీ నాశనం పట్టిస్తారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇరు పార్టీలకు ప్రజలు అరవై ఏళ్లు అధికారం అప్పగించినా, ఈ ప్రాంత ప్రగతి కోసం ఏనాడూ కృషి చేయలేదని ఆమె దుయ్యబట్టారు. అలాంటిది ఇప్పుడు ఖర్మకాలి కూటమి గెలిచినా తెలంగాణకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అసలు తెలంగాణకు బద్ధ విరోధిగా ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. గురువారం నిజామాబాద్ రూరల్ తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కూడుకుని ఉన్నది మహాకూటమి కాదని, అది ప్రజలు లేని కూటమి అని ఎద్దేవా చేశారు. కూటమి నేతల హృదయాల్లో ప్రజలు కానీ, వారి ప్రయోజనాల కోసం పాటుపడాలనే తపన ఎంతమాత్రం లేదని, కేవలం అధికారమే పరమావధిగా నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ఒక్కటయ్యారని దుయ్యబట్టారు. కూటమి కుట్రలను ప్రజలు గుర్తించి ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు. కాగా, తమ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ పదవి పొందిన డాక్టర్ భూపతిరెడ్డి టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. పార్టీకి రాజీనామా చేసి, తెరాస ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని మాత్రం అట్టి పెట్టుకోవడం శోచనీయమని, ఇది ఎంతమాత్రం నైతికత కాదన్నారు. తక్షణమే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశామన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజల్లో తన పలుకుబడి ఎంత ఉందో నిరూపించుకోవాలని భూపతిరెడ్డికి సవాల్ చేశారు. కాగా, రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌పై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసిన విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని ఎంపీ కవిత ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. సరైన సమయంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇదిలాఉండగా, ప్రతిపక్షాలు ఏకమై ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ పార్టీయేనని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో సెగ్మెంట్‌లో మునుపెన్నడూ లేనివిధంగా వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానే్న పరిశీలిస్తే, గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలోనే 4400 కోట్ల రూపాయల నిధులను ప్రగతి పనుల కోసం మంజూరు చేయించుకున్నామని తెలిపారు. అదనంగా మరో లక్ష ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ సెగ్మెంట్‌లో సాగునీరు అందించేందుకు 2వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో మంచిప్ప ఎత్తిపోతలను నిర్మిస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా ఇంటింటికి లబ్ధి చేకూర్చామన్నారు. అభివృద్ధికి పాటుపడే తెరాస అభ్యర్థినే గెలిపించాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ.గౌడ్, తెరాస రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్, జడ్పీ వైస్‌చైర్మెన్ గడ్డం సుమనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.