రాష్ట్రీయం

జగన్ నిందితుడి బెయిల్ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), నవంబర్ 16: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు శ్రీనివాసరావుపై బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అతని న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై వాదోపవాదాలు జరిగాయి. అనంతరం అతని బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి ఎస్.నాగార్జున కొట్టివేశారు. సీఐ మళ్ళ శేషు నేతృత్వంలో ఎయిర్‌పోర్టు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.