రాష్ట్రీయం

ఔను! సీబీఐకి నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కేంద్రానికి మేం భయపడం * హోంమంత్రి చినరాజప్ప స్పష్టీకరణ
అమరావతి, నవంబర్ 16: సీబీఐ ఎంట్రీని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థకు కోర్టు ఆదేశాల మేర ఏ రాష్ట్రంలో అయినా విచారించే అధికారం ఉందని పలువురు వాదిస్తుంటే సీబీఐ ఏర్పాటైన నాటి చట్టం ప్రకారం ఆ సంస్థ ఢిల్లీకే పరిమితమని రాష్ట్రాల్లో విచారణ జరపాలంటే అందుకు ఆయా ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల కాలంలో సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో న్యాయ నిపుణులు, మేధావుల సూచన మేరకు సాధారణ సమ్మతిని రద్దుచేస్తూ జీవో జారీ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఈ విషయమై సచివాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పోలీస్ చట్టం ప్రకారం 1946లో సీబీఐ ఏర్పాటైందని, అందువల్ల అది హస్తినకే పరిమితమని తేల్చి చెప్పారు. ఇకపై రాష్ట్రానికి చెందిన ఏ కేసైనా దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని 6వ సెక్షన్ ప్రకారం సీబీఐ దర్యాప్తుకు రాష్ట్రాల సమ్మతి తప్పనిసరని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన సాధారణ సమ్మతి (జనరల్ కనె్సంట్)ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిందని చెప్పారు. దాన్ని రద్దు చేయటం వల్ల ఇకపై విచారణ నిమిత్తం రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి జీవో 126ను ఈనెల 8వ తేదీన విడుదల చేశామని కర్ణాటక ప్రభుత్వం కూడా సీబీఐకి ఇచ్చిన జనరల్ కనె్సంట్ రద్దు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైనా విచారణ జరపాల్సి వస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల విషయాల్లో మాత్రం నిబంధనలు పాటించాల్సిందే అన్నారు.
ఈడీ అధికారాలు ఇలా ఉంటే, తమ పరిశీలనలోకి వచ్చిన కేసు దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో భాగంగా సాక్ష్యాధారాల సేకరణ, తదుపరి దర్యాప్తు చేయడం వంటి చర్యలను ఈడీ చేపట్టవచ్చు.అలాగే సాక్ష్యాల సేకరణ కోసం లాకర్ తెరిచే అలాగే అల్మారాలు పగులగొట్టే అధికారం కూడా దీనికి ఉంటుంది. తమ సాక్ష్యాధారాల అధారంగా మనీలాండరింగ్ తదితర నేరాల్లో ఎవరైనా దోషిగా తేలితే వారిని అరెస్టు చేసి కోర్టులో వ్యాజ్యాలు మొదలు పెట్టే అధికారం కూడా ఈడీకి ఉంటుంది.