రాష్ట్రీయం

తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు అంత సులువు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి
===========
కర్నూలు, నవంబర్ 16: తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికల్లో ప్రజాకూటమి గెలుపు అంత సులువేం కాదని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఆయన ఆంధ్రభూమితో కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని దాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో కూటమి నేతలు శక్తికి మించి కష్టపడితే సానుకూల ఫలితాలు పొందవచ్చని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ఇంకా కసరత్తు కొనసాగుతున్నందున ప్రచారానికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు. అయినా శ్రమిస్తే ప్రజల మెప్పు పొందవచ్చని వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా, ప్రజా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐకి కేటాయించింది. హైదరాబాదులో మజ్లిస్ 7 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సునాయాశంగా విజయం సాధించే స్థానాలు చెరో 25 ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత వెల్లడించారు. మజ్లిస్ పోటీ చేస్తున్న 7 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని, ఎన్నికల అనంతరం వారు టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తారని ఆయన గుర్తుచేశారు. దీంతో వారి బలం 32కు చేరుతుందని వివరించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఖచ్చితంగా విజయం సాధించే స్థానాలు 57 పోను మిగిలిన 62 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న 69 స్థానాల్లో 35 స్థానాలకు పైగా విజయం సాధించాల్సి ఉంటుందని తెలిపారు. కూటమిలోని పార్టీలు విజయం సాధించే స్థానాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఇదే లక్ష్యంతో పని చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 65 స్థానాల్లో 28 చోట్ల గెలిస్తే చాలని ఆయన తెలిపారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తున్నందున ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజాకూటమికి వెళ్లకుండా ఆ పార్టీ అడ్డుకట్ట వేస్తుందన్న విషయాన్ని నాయకులు గుర్తించాలని ఆయన అన్నారు. ప్రత్యర్థి పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు కైవశం చేసుకునే లక్ష్యంతో శ్రమించాల్సి ఉంటుందన్నారు.
ప్రజాకూటమిలో భాగమైన తెలుగుదేశం పోటీచేస్తున్న 14 స్థానాల్లో తొమ్మిదింటిని దక్కించుకోవడం ఖాయమని ఆయన చెప్పారు. సీపీఐ, టీజేఎస్ విజయావకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీల నుంచి కాంగ్రెస్ గెలుపును కాకుండా ఆ పార్టీలకు చెందిన ఓట్లను రాబట్టుకోవడంపైనే ప్రధాన దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ పోటీ చేస్తున్న 94 స్థానాల నుంచే మేజిక్ ఫిగర్ 60 స్థానాలను దక్కించుకోవడంపైనే పార్టీ నేతలు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల, చంద్రబాబు ప్రచారాన్ని ఆ పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నారు. కింది స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా దిశానిర్ధేశ్యం చేస్తూ వారిని యుద్ధానికి సిద్ధం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుందన్నారు.