రాష్ట్రీయం

స్వైన్ ఫ్లూ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 17: రాష్ట్రంపై స్వైన్ ఫ్లూ పంజా విసిరింది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే గుంటూరు, కర్నూలు జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ ఎక్కువగా విజృంభించింది. రాష్టవ్య్రాప్తంగా నమోదయ్యే కేసుల కంటే ఈ రెండు జిల్లాల్లోనే స్వైన్‌ఫ్లూ బారినపడుతున్నవారే అధికంగా ఉన్నారు. ఇప్పటికే చిత్తూరు, విశాఖ, అనంతపురంలో కేసులు నమోదవుతున్నాయి. అయితే గుంటూరు, కర్నూలులో స్వైన్‌ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారమే కర్నూలులో 46, గుంటూరులో 30 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుంటూరు నగరానికి చెందిన గాలి అంకమ్మ అనే యువకుడు శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శనివారం ఉదయం ఫిరంగిపురానికి చెందిన మున్నంగి కృష్ణమోహన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో స్లైన్‌ఫ్లూ మరణాల సంఖ్య ఏడుకు చేరగా, కర్నూలులో ఇద్దరు మృతిచెందినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అక్టోబర్ నుంచి రాష్టవ్య్రాప్తంగా ఏదో ఒకచోట స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. తీర్థయాత్రలు, ఇతర కారణాలతో బయటి రాష్ట్రాలకు వెళ్లివచ్చిన వారి నుంచి స్వైన్‌ఫ్లూ వ్యాప్తిచెందుతున్నట్లు తెలుస్తుంది. వైద్యారోగ్య శాఖ రాష్టవ్య్రాప్తంగా స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించడం, చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
స్వైన్‌ఫ్లూలో కొత్తవైరస్..
స్వైన్‌ఫ్లూ వ్యాధిలో కొత్తగా హెచ్3 ఎన్2 రకం వైరస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ రకం వైరస్‌ను ఇప్పటికే ధ్రువీకరించింది. బలహీనంగా ఉన్న ఈ కొత్త వైరస్ రోగులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్వైన్‌ఫ్లూ మరణాలు పెరుగుతుండటంతో ఈ కొత్త వైరస్‌ను ఎదుర్కొనే హెల్త్ ఇమ్యునిటీ ప్రజానీకంలో తక్కువగా ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు బాధితుల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసుకుంటూ చివరి క్షణాల్లో ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరణాల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వ వైద్యులు భావిస్తున్నారు.