రాష్ట్రీయం

కదలని ‘ భూమికి భూమి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 17: పోలవరం భూసేకరణలో నిర్వాసితులకు భూమికి భూమిగా కేటాయించాల్సిన భూసేకరణ అతీగతీ లేకుండా పోయంది. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పోలవరం ప్రాజెక్టు కుడివైపు నిర్వాసితులకు భూమికి భూమి కేటాయింపు పూర్తయినప్పటికీ ఎడమవైపు నిర్వాసితులకు ఇంకా భూమికి భూమి కేటాయింపు ప్రక్రియ మాత్రం పూర్తి మందగమనంలో సాగుతోంది. మరో వైపు ఇప్పటివరకు నిర్వహించిన భూసేకరణలో చెల్లింపులు చేసేందుకు ఆన్‌లైన్ ఇబ్బందుల వల్ల ముందుకు సాగడం లేదు. దీంతో బిల్లులు సకాలంలో విడుదలకాక పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తీవ్ర గందరగోళం నెలకొంది. 2016 భూమికి భూమి లెక్కలకు, తాజా నివేదికలో పొందుపర్చిన భూమికి భూమిగా సేకరించాల్సిన భూమికి అసలు పొంతన కుదరడం లేదు. పునరావాస కాలనీలకు, భూమికి భూమి, ప్రాజెక్టుకు భూసేకరణ తదితరాల్లో ఇదమిద్దంగా ఎంతనేది స్పష్టం కావడం లేదు. దీంతో ఒక ఏడాదికి మరో ఏడాదికి భూమికి భూమిగా ఇవ్వాల్సిన భూమి లెక్కల్లో స్పష్టత కొరవడింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తప్ప పునరావాసంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టుగా కన్పించడం లేదు. 2016లో ప్రాజెక్టు తూర్పు వైపు భూమికి భూమి కింద నిర్వాసితులకు ఇవ్వాల్సిన భూమి 9402.34 ఎకరాలుగా నిర్ధేశించారు. అందులో 579.10 ఎకరాలు సేకరించారు. ఇంకా 8805.24 ఎకరాలు ఇంకా సేకరించాల్సిందిగా నిర్ధారించారు. 2017 నివేదికలో మొత్తం 20525.23 ఎకరాలు అవసరంగా గుర్తించారు. ఇంకా 19743.25 ఎకరాలు సేకరించాల్సి ఉందని గుర్తించారు.
పశ్చిమలో 8184 ఎకరాలు సేకరించాల్సిందిగా గుర్తించి ఈ మొత్తం భూమిని పంపిణీ చేసినట్టు చూపించారు. మళ్లీ ఏడాది జనవరి నాటి నివేదికలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో భూమికి భూమిగా 75074.65 ఎకరాలు సేకరించాల్సిందిగా పేర్కొన్నారు. అందులో 41910.18 ఎకరాలు సేకరించడం జరిగిందని, ఇంకా 33164.47 ఎకరాలు సేకరించాల్సి ఉందని పేర్కొనడం విడ్డూరంగా కన్పిస్తోంది. అదే నివేదికలో మళ్లీ పశ్చిమ గోదావరి జిల్లాలో 8184 ఎకరాలకు గాను మొత్తం పంపిణీ చేసినట్టుగా ప్రకటించారు. అనంతరం తదుపరి 2018 ఆగస్టు, అక్టోబర్ మాసాల నివేదికల్లో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో భూమికి భూమిగా 19426.79 ఎకరాలు పంపిణీ చేయాల్సిందిగా చూపించారు. అందులో 2023.03 ఎకరాలు సేకరించామని, ఇంకా 17403.75 ఎకరాలు సేకరించాల్సిందిగా నివేదించారు. ఏదేమైనప్పటికి ఇప్పటి వరకు భూసేకరణలో ఒక స్పష్టమైన తీరు కన్పించడం లేదు. తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లింపు మాటెలా ఉన్నప్పటికీ నిర్వాసితులకు భూమికి భూమి పంపిణీలో మాత్రం కదలిక కన్పించడం లేదు.
అయితే 2016లో భూమికి భూమిని ఇచ్చేందుకు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మొత్తం రూ.1228.60 కోట్లు అవసరంగా అంచనా వేశారు. అందులో ఇప్పటివరకు రూ.54.36 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో 2018లో మొత్తం 19426.79 ఎకరాలకు రూ.2079.44 కోట్లు అవసరంగా అంచనా వేశారు. అందులో ఇప్పటి వరకు రూ.106.08 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ.1973.36 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు.