రాష్ట్రీయం

పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 18: వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో రోజురోజుకు బకాయిలు పెరిగిపోతున్నాయి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్)కు రావాల్సి ఉన్న బకాయిల శాతం ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. దీనివల్ల సంస్థకు ఆర్థిక భారమవుతోంది. అసలే విద్యుత్ చార్జీలు పెరగకపోవడం, తుపాన్ల వలన ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న ఈపీడీసీఎల్‌కు ఆయా ప్రభుత్వరంగ సంస్థల విద్యుత్ బకాయిలు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. అందువల్ల వీటి వసూళ్ళ కోసం ఇకపై కఠినంగా వ్యవహరించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎక్కువ శాతంలో బకాయిపడిన ప్రభుత్వరంగ సంస్థలపై దృష్టిసారించాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కోట్లది రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉండే వాటికి నోటీసులు జారీ చేయడం ద్వారా హెచ్చరికలు చేయగలిగింది. అప్పటికీ చెల్లింపులకు చేయని పక్షంలో విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని నిర్ణయించింది. ప్రధానంగా జలవనరుల శాఖ (ఎత్తిపోతలు) నుంచి విద్యుత్ బకాయిల రూపంలో ఏకంగా రూ.490 కోట్ల మేర రావాల్సి ఉంది. అలాగే మేజర్ పంచాయతీలు రూ.226 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీలు రూ.410 కోట్లు, మునిసిపాలీటీలు నుంచి రూ.14 కోట్లు, రెవెన్యూ శాఖ నుంచి రూ.16 కోట్ల వరకు బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రభుత్వ సంస్థలు 50కోట్ల రూపాయల లోపే చెల్లించాల్సి ఉంది. ఆసుపత్రుల విషయానికొస్తే రూ.11 కోట్లు, గ్రామీణ నీరుపారుదల శాఖ నుంచి రూ.12 కోట్ల మేర బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. ఇవి కాకుండా ట్రెజరీ, పశుసంవర్ధక శాఖ, ఆర్టీసీ, దేవాదాయ, ధర్మాదాయశాఖ, పోలీసుశాఖ వంటి తదితర ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో వసూలు కావాల్సి ఉంది. ఆయా ప్రభుత్వ సంస్థలన్నింటి నుంచి దాదాపు రూ.1300 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వీటన్నింటినీ ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించిన యాజమాన్యం తొలి దశలో నోటీసులు జారీ చేస్తోంది. ఎక్కువుగా బకాయి పడిన జలవనరుల శాఖ నుంచి రూ.490 కోట్ల మేర వసూలు కావాల్సి ఉండటంతో దీనికి ఇటీవల సంస్థ నోటీసులు జారీ చేసింది. అలాగే మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలకు నోటీసులు వెళ్ళాయి. ప్రభుత్వ నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడం వలనే ఈవిధంగా విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరగడంలేదంటూ ఆయా సంస్థలు చెబుతున్నాయి. అయితే, గతంలో మాదిరి నెలల తరబడి బకాయిల చెల్లించకుండా మొండికేసే సంస్థల పట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ముందుగా నోటీసులు జారీ చేయడం ఆ తరువాత కొంత సమయం ఇచ్చి విద్యుత్ కనెక్షన్ తొలగించడం వంటివి చేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.