రాష్ట్రీయం

గ్రామాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనితీరుపై ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి ఒక మల్టీపర్పస్ డ్రైన్ క్లీనింగ్ యంత్రాలను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామీణాభివృద్ధిని సామాజిక బాధ్యతగా భావించాలని అధికారులను సీఎస్ పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జాతీయ రూర్బన్ మిషన్ రాష్ట్ర స్థాయి ఎన్‌ఫోర్సుమెంట్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత విషయంలోప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూర్బన్ మిషన్ కింద 13 జిల్లాలను 13 క్లస్టర్లుగా చేసి, 16 అంశాలకు సంబంధించిన వివిధ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలకు మండలానికి కోటి రూపాయలు చేయవచ్చని తెలిపారు. మొదటి దశలో 5 జిల్లాల్లో, రెండు, మూడు దశల్లో మిగిలిన జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణాభివృద్ధిలో అన్ని శాఖలకు సంబంధించి సమాచార వ్యూహం కీలకమని సీఎస్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో జీడీపీఏ సమావేశాలు నిర్వహించినప్పుడు, వివిధ శాఖల అధికారులను కూడా ఆహ్వానించాలన్నారు. గ్రామాల అభివృద్ధి విషయంలో అన్ని శాఖలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.