రాష్ట్రీయం

నేడు చలో హాయ్‌లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ఈనెల 21న తలపెట్టిన చలో హాయ్‌లాండ్ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ విశ్వనాథరెడ్డి, వీ తిరుపతిరావు మంగళవారం తెలిపారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు ప్రారంభమయ్యాయన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ బాధితులను దారుణంగా మోసం చేయడంలో భాగంగా హాయ్‌లాండ్ తమ ఆస్తికాదని, ఆర్కా లీజర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదని పేర్కొనడం లక్షలాది మంది బాధితులలో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఈ సందర్భంగా 21వ తేదీ హాయ్‌లాండ్ వద్ద నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని గుంటూరు అర్బన్ పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని, వేలకోట్లు పేదల నుండి కొల్లగొట్టిన అవ్వా సీతారామారావు, అవ్వా మణిశర్మ,
ఉదయభాస్కర్‌లు దొరల్లాగా విజయవాడలో విహరిస్తూ బినామీ ఆస్తులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటే అడ్డుకోవడం పోలీసులకు చేతగావడం లేదన్నారు. హాయ్‌లాండ్ తన డ్రీమ్ ప్రాజెక్టని, కలల సౌధమని, మిగిలిన అన్ని ఆస్తులు అమ్మిన అనంతరమే హాయ్‌లాండ్ వేలం గురించి ఆలోచించాలని కోర్టుకు విన్నవించుకున్న అగ్రిగోల్డ్ యాజమాన్యం నేడు అది తమది కాదని ధర్మాసనాన్ని మోసగించడానికి ప్రయత్నించడం క్షమించరానిదన్నారు. పోలీసు ఆంక్షలు ఎత్తివేసి నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు.