రాష్ట్రీయం

పేదలకు స్థిరాస్తి కల్పనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పట్టణాల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అర్బన్ హౌసింగ్‌పై మంగళవారం కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహనిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి న్యాయ సలహాల్లో జాప్యం జరగరాదన్నారు. లబ్ధిదారుల నుంచి వ్యక్తిగత లేఖలు వెంటనే తీసుకోవాలని సూచించారు. అతి స్వల్ప అంశాలను కూడా క్లిష్టం
చేయటం సరైంది కాదన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టంచేశారు. ప్రతి బుధవారం అర్బన్ హౌసింగ్‌పై సమీక్ష జరుపుతామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అన్ని వసతులతో సొంత ఇంటిని నిర్మించాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పట్టణ గృహనిర్మాణం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అని, ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి పథకం అమలు కావటం లేదని చెప్పారు. పేదలకు స్థిరమైన ఆస్తిని సమకూర్చటం గృహనిర్మాణ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. ఒక ఇల్లు కట్టాలంటే వంద ఏజెన్సీల చుట్టూ తిరగాలి.. ఉబరైజేషన్ ద్వారా అన్నింటినీ సమ్మిళితం చేశామని తెలిపారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంక్ రుణం, విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, వౌలిక వసతుల కల్పన అన్నీ ఒకే వేదికపైకి తెచ్చామని తెలిపారు. ప్రతి అంశానికి నిర్దిష్టమైన గడువును నిర్దేశించాలన్నారు. గడవులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. షేర్‌వాల్ టెక్నాలజీ షీట్‌లు 835 రావాల్సి ఉండగా ఇప్పటివరకు 516 దిగుమతి చేసుకున్నామని, మిగిలిన 319 షేర్‌వాల్‌లను కూడా తెప్పించుకోవాలని సూచించారు. రుణాల మంజూరును బ్యాంకర్లు వేగవంతం చేయాలని కోరారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. త్వరలో పట్టణాల్లో లక్ష గృహాల సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు తెలిపారు. ప్రతి వారం, ప్రతి శాఖ పనితీరును, పురోగతిని సమీక్షిస్తామని, బ్యాంకర్లు, డెవలపర్లు, అధికారుల పనితీరుపై విశే్లషణ ఉంటుందన్నారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక, ప్లాన్‌ల తయారీ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. ఐదు లక్షల ఇళ్లలో ఎన్ని పూర్తిచేశారు.. ఎన్ని ఇళ్లు ప్రారంభోత్సవం చేశారనే విషయాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు. పట్టణాల్లో ఇప్పటివరకు 83వేల 940 మందికి ప్లాట్లు కేటాయించారని, మిగిలిన 2లక్షల 50వేల 388 ప్లాట్లను వెంటనే కేటాయించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కరికాల వలవన్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ వరప్రసాద్, మెప్మా మిషన్ డైరెక్టర్ పి చినతాతయ్య తదితరులు పాల్గొన్నారు.