రాష్ట్రీయం

ఇవేం సర్దుబాట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ప్రజా కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు సక్రమంగా జరగలేదని తెలంగాణ జన సమితి (టీజేసీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ వ్యవహారించిన తీరు బాగా లేదని ఆయన మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. బీసీ అభ్యర్థి కోసం తాము జనగామ సీటు కాంగ్రెస్‌కు వదులుకుంటే, తమకు కేటాయించిన మిర్యాలగూడ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని దించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు టిక్కెట్ ఇస్తుందని తాము ఊహించలేదన్నారు. ప్రజాకూటమికి నష్టం లేకపోతేనే తాను జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నానని ఆయన చెప్పారు. సీట్ల సర్దుబాట్ల గందరగోళం వల్లే ముస్లింలకు తాము టిక్కెట్ ఇవ్వలేకపోయామని అన్నారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రజల ముందుకు తీసుకుని వస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రజా కూటమి ప్రత్యామ్నాయం అని ప్రజలకు అర్థమైందని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ప్రజాకూటమి ఎన్నికల ప్రణాళిక సిద్ధం అవుతున్నదన్నారు. తమ పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రణాళికను రూపొందించామని ఆయన తెలిపారు. ప్రగతికి పది సూత్రాలను పొందుపరిచారు. పాదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత సుపరిపాలన, పౌర సమాజం తీసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగించుకుని, విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు, ముఖ్యమంత్రి ప్రతి రోజు ఉదయం గంట సేపు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రణాళికలో హామీ ఇచ్చారు.
అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక న్యాయం, సాధికారత, మహిళా సాధికారత, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంట రుణాల మాఫీ వంటి అంశాలను చేర్చారు.

చిత్రం..ప్రొఫెసర్ కోదండరామ్