రాష్ట్రీయం

కాంగ్రెస్ సమన్వయకర్తగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ సమన్వయకర్తగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పార్టీ పటిష్టతకు, అభివృద్ధికి, ప్రజాకూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంకట్రామిరెడ్డికి సూచించారు. వెంకట్రామ్‌రెడ్డి పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే
కొండా సురేఖ రావడంతో ఆ సీటును పార్టీ నాయకత్వం ఆయనకు ఇవ్వలేకపోయింది. నిజానికి మూడు నెలల క్రితమే ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరకాలలో జరిగిన ప్రజా యాత్ర బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డికి టిక్కెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఇవ్వలేకపోయారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన గుర్తింపునిస్తామని పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చింది. ఇలాఉండగా పార్టీకి ఆయన సేవలను ఉపయోగించుకోవాలన్న భావనతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెంకట్రామిరెడ్డిని ఉత్తర తెలంగాణ సమన్వయకర్తగా నియమించారు.