రాష్ట్రీయం

నేతన్నల ఆత్మహత్యలు ఆపాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 20: ఆత్మహత్యలతో అల్లాడుతున్న కార్మికక్షేత్రం సిరిసిల్లలో నేతన్నల బలవన్మరణాలు ఆగాయని, అయితే మొత్తం బాగుపడలేదని, ఇంకా పడాల్సి ఉందని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అలాగే యాదగిరిగుట్టపై దృష్టి పెట్టడం వల్ల వేములవాడపై శ్రద్ధ చూపలేకపోయామని, వచ్చే సంవత్సరం వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అత్భుతమైన దివ్వక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ముఖ్య మంత్రి ప్రసంగించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన బహిరంగ సభ స్థానిక బైపాస్ రోడ్డులో నిర్వహించారు. మంత్రి కేటీ.రామారావు అధ్యక్షత వహించిన ఈ బహిరంగ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు తీవ్రంగా కొనసాగాయని, వీటిని ఆపాలని గోడలపై రాసిన రాతల చరిత్ర చూసి బాధ పడ్డానని, అయితే ఇపుడు ఆత్మహత్యలు ఆగాయని, కేటీఆర్ చొరవతో కొంత ఉపశమనం కలిగిందని, మొత్తం బాగుపడలేదని, ఇంకా పడాలన్నారు. చేతి వృత్తులు కూలి పోయావని, ఇక్కడ అపెరాల్ పార్కుతో వేలాది మందికి ఉపాధి కలుగనుందని, సిరిసిల్లలో గొప్ప చేనేత కార్మికులు ఉన్నారని, సిరిసిల్లకు దేశంలో గొప్ప పేరు రావాలని, కేటీఆర్ ఆ దిశగా పని చేస్తున్నాడని అన్నారు. సిరిసిల్లలో ఒక ఆత్మహత్య కూడా జరగవద్దని, భవిష్యత్తులో నేతన్నలు అత్భుతమైన ప్రగతి సాధిస్తారని అన్నారు. యాదగిరి గుట్టపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ది చేపట్టలేకపోయామని, వచ్చే ఏడాది దివ్వక్షేత్రంగా తీర్చిదిద్దడానికి దృష్టి సారిస్తామన్నారు. ఎగువ, మద్య, దిగువ మూడు మానేరు ప్రాజెక్టులు వచ్చే సంవత్సరం జూన్ నాటికి నిండుతాయని, 365 రోజులు నీటితో కల కల లాడుతాయన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం నీరు కూడా ఇక్కడ ప్రవహిస్తుందని, అపుడు తాను వచ్చి చూస్తానని, అంతకంటే తనకు ఆనందం ఏముంటుందన్నారు. కేసీఆర్ సీఎం కాకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా జన్మలో అయ్యేది కాదని, రాజన్న దేవుడి దయవల్ల సాధించుకున్నామన్నారు. కుల వృత్తులు కూలి పోయావని, గతం లో పాలకులు ఎవరూ పట్టించుకోలేదని, వృత్తులు బాగు పడే విధంగా ప్రోత్సాహం ఇవ్వలేదని, తీవ్ర వివక్ష కొనసాగిందని, ఇది వెనుక బడిన ప్రాంతం కాదని, వెనుక పడేసిన ప్రాంతమని అన్నారు. రోజూ 1200 లారీల గొర్రెలు మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చేవని, ఇక్కడ 30 లక్షల మంది యాదవులు ఉండగా, తాము నాలుగు వేల కోట్లతో 65 లక్షల గొర్రెలు కొనుగోలు చేశామని, వీటికి 45 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని, ఈ ఏడాది కోటి 10 లక్షల గొర్రెల సంఖ్య పెరిగిందని, దీనితో రూ.1,500 కోట్ల సంపద సాధించారన్నారు. కాంగ్రెస్ గొర్రెలకు ఇది అర్థం కాలేదన్నారు. కృల వృత్తులు కూలిపోయి నందునే ఆత్మహత్యలు పెరిగాయన్నారు. గౌడన్నలకు, రజకులకు వృత్తులు బాగు పడేలా ఆదుకున్నామన్నారు. గోదావరి జలాలతో సిరిసిల్ల ప్రాంతం 365 రోజులు జీవ కలతో ఉట్టి పడుతుందని, కొద్ది రోజుల్లోనే కల సాకారం కానుందన్నారు. తాము రాష్ట్రం కోసం బయ లు దేరిన రోజు ఎవరికీ నమ్మకం లేదని, కఠోర దీక్ష, పట్టుదలతో సాధించుకున్నామని, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. మిషన్ భగీరథ పథకంను 11 రాష్ట్రాల నుంచి వచ్చి నేర్చుకుని వెళ్ళారని, రైతు బంధు పథకంను ఐక్య రాజ్య సమితి గుర్తించిందని, ప్రశంసించారని అన్నారు. 2500 మందికి రైతు బీమా సదుపాయం అందిందని, రైతు చనిపోయిన వారం రోజులకే పరిహారం అందుతుందని, గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, వచ్చిన పంటను ప్రాసెస్ చేసి మార్కెట్‌కు తరలించే పనులన్నింటినీ ఐకేపీలు నిర్వహిస్తాయని, ఐదారు వేల మంది ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్నారు. ఇసుకపై దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడ కాంగ్రెస్ పాలకులు పదేళ్ళలో రూ.9.56 కోట్ల ఆదాయం చూపితే, తాము నాలుగేళ్ళలో రూ.2,057 కోట్ల ఆదాయం తెచ్చామని, ఇందులో ఇసుక దొంగతనం, స్మగ్లింగ్‌ను నిరోధించామని, ఇంకా 50 శాతం ఇసుక ఆదాయం రావల్సి ఉందని, గనుల మంత్రి కేటీఆర్ వల్ల ఇసుక దొంగతనం నిరోధించామన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో అభ్యర్థులకు 80 శాతం ఓట్లు వస్తున్నట్టు తాజా సర్వేలో తేలిందని, ప్రజలు ఏకోన్ముఖంగా వీరి లక్ష మెజార్టీతో గెలిపించాలని ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెరాస పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, సిరిసిల్ల, వేములవాడ తెరాస అభ్యర్థులు కేటీఆర్, రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. సిరిసిల్ల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ప్రసంగిస్తున్న ఆపద్ధరమ్మ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు
* పాల్గొన్న ప్రజలు