రాష్ట్రీయం

పురిటిగడ్డ సభలో రాజకీయాల ఊసెత్తని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 20: టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పురిటగడ్డలో నిర్వహించిన సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల ప్రచార సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చి, ప్రతిపక్ష పార్టీల నేతలను పల్లెత్తి మాట్లాడకపోవటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ ప్రసంగంలో పంచ్ డైలాగ్‌లు, ప్రతిపక్ష పార్టీల నేతలపై పదునైన విమర్శలు లేకపోవటంతో కేసీఆర్ ప్రసంగం టీఆర్‌ఎస్ కార్యకర్తలను, నాయకులను, అభిమానులను నిరాశకు గురిచేసింది. సిద్దిపేట పత్తిమార్కెట్ యార్డు మైదానంలో మంగళవారం నిర్వహించిన సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల ప్రచార సభకు వేలాదిమంది లారీలు, ఆటోలు, డీసీఎంలు, ద్విచక్ర వాహనాల్లో పెద్దఎత్తున తరలివచ్చారు. సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలు మేలాతాళాలతో, పాదయాత్ర, ర్యాలీగా తరలివచ్చారు. మధ్యాహ్నాం 12గంటల వరకు సభా ప్రాంగణమంత జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు కేసీఆర్ వచ్చి అభివాదం చేయగానే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కేసీఆర్ సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడిన 22 నిమిషాలు రైతుల అభివృద్ధి, మహిళ సంఘాలు, రేషన్ షాపులు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గూర్చి మాత్రమే ప్రసంగించారు. తన పురిటగడ్డ నుండి రైతులను ధనవంతులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కల్తీలేని ఆహార పదార్థాలు రేషన్‌డీలర్లు సరఫరా ప్రధానంగా ప్రసంగించారు. కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యత కల్పించారు. సీఎంకు కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఉత్సాహంగా వచ్చిన ప్రజలకు కేసీఆర్ తన ప్రసంగంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు, టీజేఎస్ పార్టీలను పలెత్తి మాట సైతం ప్రస్తావించకపోవటం తీవ్ర నిరాశకు గురిచేసింది. సభా వేదికపై కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గూర్చి మాట్లాడాలని చిట్టి వచ్చిందని ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి సిద్దిపేట ప్రజలకు బాగా తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సిద్దిపేట ప్రజలే చూసుకుంటారని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ పురిటగడ్డయైన సిద్దిపేట ఎన్నికల ప్రచార సభలో రాజకీయ పార్టీల నాయకులపై ఎలాంటి విమర్శలు లేకుండా అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడడంతో సీఎం కేసీఆర్ ప్రసంగం చప్పగా ఉందని పెదవి విరవటం గమనార్హం. కేసీఆర్ పదునైన మాటలు, పంచ్ డైలాగ్‌లు వినేందుకు ఎంతో ఆసక్తితో వచ్చిన టీఆర్‌ఎస్ అభిమానులకు కేసీఆర్ ప్రసంగం తీవ్ర నిరాశకు గురి చేసింది.
చిత్రం..సిద్దిపేట సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్