రాష్ట్రీయం

శరణమా? మరణమా? తేల్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: శబరిమల పవిత్రతను కాపాడేందుకు శరణమో మరణమో హిందూ ధర్మ సంరక్షకులు తెల్చుకోవల్సిన సమయం ఆసన్నమైందని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. శబరిమల పరిరక్షణ సమితి ధర్నా చౌక్ వద్ద మంగళవారం నాడు స్వామి పరిపూర్ణానంద ధర్నా నిర్వహించారు. ఆయనతో పాటు అనేక మంది భక్తులు కూడా పాల్గొన్నారు. పరిపూర్ణానంద మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శబరిమలపై జరుగుతున్న కుట్రలను అడ్డుకునేందుకు హిందూ సమాజం అంతా ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ‘ఈ విషయంలో మీరు శరణానికి సిద్ధపడితే నేనూ మరణానికి సిద్ధం’అని ప్రకటించారు. కేరళ సీఎం విజయన్ రాజధర్మం పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయ్యప్ప భక్తులను తీవ్ర ఇబ్బందులను పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై పోలీసులు వాటర్‌గన్‌లతో దౌర్జన్యంగా దాడులు చేశారని, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆరోపించారు. మహిళల ఆలయ ప్రవేశం అంశం తంత్రంలో చెప్పబడిందని, ఇవేవీ వారికి అర్ధం కావా? అని నిలదీశారు. శబరిమలలో మహిళలను అనుమతించాలా వద్దా అనేది సుప్రీంకోర్టుకు సంబంధం లేదని అన్నారు. హిందువుల మనోభావాలలో తలదూర్చే అధికారం ఏ కోర్టుకూ లేదని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాలు మన మతం, ధర్మం విషయంలో మాత్రమే జోక్యం చేసుకుంటున్నాయని, ఇది తగదని తెలిపారు.
మహిళలు ఆలయంలోకి వెళ్లబోమని చెబుతుంటే న్యాయస్థానాలు మాత్రం జోక్యం చేసుకుని బలవంతంగా పంపిస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు వెనుక అదృశ్య హస్తాలున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హిందువుల పండగలపై మాత్రమే ఆంక్షలు ఎందుకు ఉంటాయని, మిగిలిన మతాల పండుగలపై ఎందుకు ఆంక్షలు ఉండబోవని అన్నారు. మతోన్మాదుల గుండెలు బద్దలయ్యేలా మనమంతా ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, నేతాజీ లాంటి వారు ఆనాడు దేశం కోసం బరిలోకి దిగితే, ఈనాడు మనం అంతా ధర్మం కోసం బరిలోకి దిగాలని అన్నారు. మనం ఎవర్నీ చంపమని చెప్పడం లేదని, ధర్మం కోసం చస్తామని చెబుతున్నామని , అదే హిందూ మతం గొప్పతనమని చెప్పారు.
చిత్రం..ధర్నా శిబిరంలో మాట్లాడుతున్న పపూర్ణానంద