రాష్ట్రీయం

‘నవరత్నాల’తో ఆదుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, నవంబర్ 21: రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నవరత్నాల పథకాలతో ప్రజలను ఆదుకుంటానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం దాసరిపేట కూడలి నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర చినమేరంగి, అల్లువాడ, తుంబలి, జోగులడుమ్మ గ్రామాల మీదుగా
శిఖబడి క్రాస్ రోడ్డు వరకు కొనసాగింది. ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌కు సమస్యలను విన్నవించారు. సాక్షరాభారతి కో ఆర్డినేటర్లుగా 20 ఏళ్ళు పనిచేశామని, అకస్మాతుగా తమను ప్రభుత్వం తొలగించిందని జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో లింక్ వర్కర్లుగా అనేక ఏళ్ళు పనిచేశామని, ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించిందని లింక్‌వర్కర్లు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే అల్లువాడ గ్రామంలో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి పదేళ్ళు కావస్తున్న చుక్క నీరైన రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఎన్‌టిఆర్ గృహ నిర్మాణాలు మంజూరు చేయడం లేదని గంగమ్మపేట, చినతుంబలి గ్రామస్థులు జగన్‌కు విన్నవించారు. వట్టిగెడ్డలో రేగిడిగెడ్డ మిగులు జలాల అనుసంధానం పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనులు సత్వరమే పూర్తిచేయడానికి సహకరించాలని వట్టిగెడ్డ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు కోరారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు, షట్టర్లు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయని, పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు జగన్‌కు తెలిపారు. వరి కొనుగోలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని, దళారులకు వరి పంటను అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, అరకు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్‌రాజు, జిల్లా పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వేలాదిమంది వైసీపీ కార్యకర్తలు, నాయకుల మధ్య పాదయాత్ర కొనసాగింది.

చిత్రం..సమస్యలు వింటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి