రాష్ట్రీయం

తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ జనసేన దుకాణాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 21: తెలంగాణలో వైసీపీ, జనసేన పార్టీలు తమ దుకాణాలు బంద్ చేసుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం గుంటూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్‌గాంధీ భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తుంటే వైసీపీ, జనసేన ఓటమి భయంతోనే పోటీచేయడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందన్నారు.
రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కేంద్రాన్ని కోరినా జనసేన, వైసీపీ అధినేతలు ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. వారు ప్రజల పక్షమో, బీజేపీ పక్షమో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం మోసగించిందని, పవన్, జగన్‌లు ఈ విషయంపై నోరు మెదపకపోవడం బీజేపీతో కుమ్మకయ్యారన్న అనుమానాలకు బలం చేకురుస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ తొలి సంతకంతో పాటు, రైతులు, డ్వాక్రా మహిళలకు 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తారన్నారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని, రాహుల్‌గాంధీ దేశ ప్రధాని కావాలని దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సర్వేల్లో 62 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని, వారి వెంట వెళ్లేవారు కూడా మునిగిపోవడం ఖాయమన్నారు.
దేశంలో యుపిఏ, ఎన్డీయేలే పాలన చేస్తాయే తప్ప మూడవ కూటమికి అవకాశం ఉండబోదన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 2వ తేదీ నుండి చేపట్టిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమం డిసెంబర్ 12తో ముగుస్తుందని రఘువీరా తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల పోలింగ్ బూత్‌లలో బూత్ కమిటీలు 70 శాతం పూరె్తైందని, మిగిలిన వాటిని డిసెంబర్ 12 నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టు శక్తి కార్యక్రమంలో భాగంగా 8108048888కు ఓటరు ఐడి నెంబర్‌ను మెస్సేజ్ చేస్తే వారి పేరు నమోదవుతుందని, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు వారికి తెలుస్తాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కనుమూరి బాపిరాజు, పక్కాల సూరిబాబు, సూర్యానాయక్, లింగంశెట్టి ఈశ్వరరావు, మక్కెన మల్లిఖార్జునరావు, కొరివి వినయ్‌కుమార్, యర్రం వెంకటేశ్వరరెడ్డి, అలెగ్జాండర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి