రాష్ట్రీయం

కాంగ్రెస్‌లో కొనసాగుతున్న బుజ్జగింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు రాకపోవడంతో అసంతృప్తితో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించి, ఆ నామినేషన్లు ఉపసంహరించేందుకు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఇంకా సుమారు 10 నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మేడ్చల్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోటకూర జంగయ్య యాదవ్‌ను పార్టీ నాయకత్వం బుజ్జగించింది. ఏఐసీసీ నాయకుడు జైరాం రమేష్, కర్నాటక మంత్రి డికె శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, కుసుమ కుమార్ ఆయనకు నచ్చజెప్పారు. శేరిలింగంపల్లిలో
తిరుగుబాటు అభ్యర్థి బిక్షపతి యాదవ్‌ను ఏఐసీసీ నాయకుడు అహ్మద్ పటేల్ కలిసి నచ్చజెప్పారు. బిక్షపతి యాదవ్ మహాకూటమి అభ్యర్థితో కలిసి పని చేస్తారని అహ్మద్ పటేల్ చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సరైన గుర్తింపునిస్తామని అన్నారు. అయితే ఎటువంటి గుర్తింపు ఇస్తాం, ఏ పదవి ఇస్తామన్నది ఇప్పుడు చెప్పడం భావ్యం కాదన్నారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నందున ఈ లోగా మిగతా తిరుగుబాటు అభ్యర్థులనూ కలిసి ఉపసంహరింపజేయడానికి అధిష్టానం నేతలు, రాష్ట్ర పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
రేవంత్ నివాసానికి జైరాం రమేష్
ఇలాఉండగా బుధవారం రాత్రి ఏఐసీసీ నాయకుడు జైరాం రమేష్ టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి పార్టీ వ్యవహారాలపై చర్చించారు.