రాష్ట్రీయం

సీల్డ్ కవర్ సీఎం మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, నవంబర్ 21: రాష్ట్ర పాలనకు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలా? తెలంగాణ మట్టి బిడ్డక కావాలా? అని ఆపద్ధర్మ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కొడంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో నియోజకవర్గ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతు 69 సంవత్సరాలు కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించిన ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాలుగున్నర ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని రంగాలలో లబ్ధి పోందేవిధంగా కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలను దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించాయని అన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్ మీద విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

చిత్రం..కొడంగల్‌లో నియోజిక వర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో