రాష్ట్రీయం

కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఏఐసీసీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం నిలదీశారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఓడించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాయని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. నిరంకుశ పాలనను కాపాడుకోవడానికి టీఆర్‌ఎస్ నేతలు బీజేపీని విమర్శించడం లేదని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ఇందులో భాగంగానే కాంగ్రెస్-టీడీపీ మిత్రపక్షాలుగా మారాయని ఆయన వివరించారు. గత ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క హామీ అమలు చేయలేదని చిదంబరం విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి ఏమైందన్నారు. భూ పంపిణీ చేస్తే ఆధార్ కార్డులతో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీలకు కల్పిస్తామన్న 12 శాతం రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం హామీ ఏమైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. 2009 డిసెంబర్ 9న తాను చేసిన చారిత్రాత్మక ప్రకటనను మరిచిపోలేనని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం