రాష్ట్రీయం

శబరిమలకు టీఎస్ ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్‌టీసీ 56 ప్రత్యేక బస్సులను నడుపుతోందని రంగారెడ్డి ఆర్‌టీసీ ఆర్‌ఎం ఇ.యాదగిరిరెడ్డి చెప్పారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతి ఏటా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్‌టీసీ బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ఈ ఏడాది అయ్యప్ప భక్తుల నుంచి ఎక్కువ వినతులు రావడంతో బస్సుల సంఖ్యను పెంచామన్నారు. ఇంధన ధరలు పెరిగినప్పటికీ అయ్యప్ప భక్తుల సేవ కోసం బస్సు అద్దెలు పెంచడంలేదని చెప్పారు. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, పరిగి, చేవేళ్ళ, శంకర్‌పల్లి, తాండూర్ కేంద్రాలకు ఆయా బస్సులు బయలు దేరుతాయన్నారు. బస్సుల ఛార్జీ 1కిలోమీటరుకు 30,14,42,45 రూపాయలు వసూళ్ళు చేస్తామన్నారు. ప్రతి రోజు కనీసం ఒక బస్సు 480 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి బస్సులో ఇద్దరు వంట వారితో సహా ఇద్దరు మణికంఠ స్వాములతో పాటు ఒక లగేజ్ బాయ్‌కు అనుమతి ఇస్తామన్నారు. బస్సుల బుకింగ్ కోసం ఏజెంట్లకు రోజుకు ఒక బస్సుకు రూ 300 రూపాయలు కమీషన్ ఇస్తామన్నారు. బస్సులో ఆడియో, వీడియోతో పాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం రీజినల్ కార్యాలయంలో శబరిమలకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ యాదగిరి, సీనియర్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ పీఎస్‌కే రెడ్డి, రంగారెడ్డి డివిజన్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు.

చిత్రం..శబరిమల ప్రత్యేక బస్సులకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేస్తున్న ఆర్‌ఎం యాదగిరి, పీఎస్‌కే రెడ్డి, డీఎం శ్రీదేవి