రాష్ట్రీయం

16వేల శ్రీవారి లడ్డూలు పక్కదారి?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 21: ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లను అక్రమంగా పొందుతున్న దళారులు, లడ్డూ టోకెన్లను దొడ్డిదారిలో విక్రయిస్తున్న మోసగాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా 16వేల లడ్డూ టోకెన్లను కొంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్రమంగా పొంది విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్‌చేశారు. ఈ లడ్డూ టోకెన్ల కుంభకోణంలో టీటీడీ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు టీటీడీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా అత్యాధునిక సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నా మోసగాళ్లు మాత్రం మరో అడుగు ముందుకు వేసి దర్జాగా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాల్లో పట్టుబడిన వారికి చిన్న చిన్న శిక్షలు మాత్రమే పడుతున్నాయి. అలాకాకుండా ఇలాంటి నేరాలు రుజువైతే అలాంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.