జాతీయ వార్తలు

ఘనంగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సమావేశాలు ఆంధ్ర, తెలంగాణ భవన్‌లో రెండవరోజు ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలలో భాగంగా ప్రముఖ నర్తకీమణి యామినీ కృష్ణమూర్తి, చిత్రకారులు రామారావు, ప్రముఖులు జయరామారావు, రాజా రాధారెడ్డి, విజయసాయి, మెండు చక్రపాణి తదితరులను సమాఖ్య ఘనంగా సన్మానించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలన్నీ గతంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్యగా ఏర్పడ్డాయి. సమాఖ్య అధ్యక్షుడు పివిపిసి ప్రసాద్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారి సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమాఖ్య తదుపరి కార్యకలాపాలు చర్చించడం జరిగిందని, జూన్ నెలలో పూనాలో సాహితీ సదస్సు, ఆగస్టు నెలలో హూసూర్ త్యాగరాజు ఉత్సవాలను జరపాలని నిశ్చయించామన్నారు.