రాష్ట్రీయం

‘వీణవంక’ ఘటనపై అట్టుడికిన సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27:వీణవంకలో దళిత అమ్మాయిపై జరిగిన అ త్యాచారం సంఘటనపై ఆదివారం శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు వాకౌ ట్ చేశారు. వీణవంక అత్యాచార సంఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై వివరణ అడిగేందుకు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు లేచి మంత్రి ప్రకటనలు, వివరణ ఉండదని రూల్స్ చదివి వినిపించారు. కాంగ్రెస్ సభ్యులు వివరణ కోసం పట్టుపడుతుండగానే స్పీకర్ మధుసూదనాచారి పద్దులపై మాట్లాడాలని తొలుత చిన్నారెడ్డిని కోరారు. ఎన్నిసార్లు పిలిచినా చిన్నారెడ్డి మాట్లాడకపోవడంతో టిఆర్‌ఎస్ సభ్యులు జలగం వెంకట్రావును మాట్లాడాలని కోరారు. శాసన సభాపక్షం ఉప నాయకుడు జీవన్‌రెడ్డి, డికె అరుణ, పద్మజారెడ్డి పోడియం వద్దకు వెళ్లి వివరణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంశాఖకు సంబంధించిన పద్దులపై చర్చ కూడా ఉన్నందున వీణవంక సంఘటనపై కాంగ్రెస్ సభ్యులకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ చర్చలో లేవనెత్తితే సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం పంతానికి పోకూడదని, వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పంతానికి పోవడం లేదని, శనివారం కూడా పద్దులపై చర్చను పక్కన పెట్టి హెచ్‌సియు సంఘటనపై చర్చకు అంగీకరించినట్టు హరీశ్ గుర్తు చేశారు. ఈ దశలో పద్దులపై టిఆర్‌ఎస్ సభ్యులు జలగం వెంకట్రావు మాట్లాడుతుండగా, ప్రతిపక్ష నాయకులు కె జానారెడ్డి కూర్చోని ఉండగా, ఆయన చుట్టూ డికె అరుణ, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరి అక్కడే మాట్లాడుకోసాగారు. దీనిపై హరీశ్‌రావుఇదేం సంస్కారమంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలను సభలో చూపించవద్దని వ్యంగ్యంగా అన్నారు.
కాగా ఒక దళిత మహిళపై జరిగిన అత్యాచారంపై మాట్లాడనివ్వరా? అని జీవన్‌రెడ్డితో పాటు డికె అరుణ, పద్మజారెడ్డి పోడియం వద్దకు వెళ్లి ప్రశ్నించారు. తమ సభ్యునికి వివరణ అడిగే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
అంతకు ముందు వీణవంక ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సభలో మూడు పేజీల ప్రకటన చేశారు. పోలీసు ఉద్యోగానికి ఉచిత శిక్షణకు వచ్చిన వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన ఎస్సీ బాధితురాలితో గొట్టి శ్రీనివాస్‌కు పరిచయం అయిందని, అతను బాధితురాలిపై అత్యాచారం జరపగా, అతని స్నేహితులు ఇద్దరు వీడియో తీసినట్టు తెలిపారు. ఈ సంఘటనలో ఎ1ఎ2 నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు, ఎ3ని జువైనల్ హోంకు పంపినట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని, జమ్మికుంట రూరల్ ఇన్‌స్పెక్టర్‌కు చార్జ్ మెమో ఇచ్చినట్టు తెలిపారు. రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుండి రిపోర్ట్, మెడికల్ ఫైనల్ రిపోర్టు అందిన తరువాత కేసులో చార్జీషీటు వేయనున్నట్టు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హోంమంత్రి తెలిపారు.