రాష్ట్రీయం

ఇబ్బందులున్నా.. ప్రగతి పథంలో రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ రాయలసీమలో కరవు, కోస్తా జిల్లాల్లో తుపాను ఎక్కువ అని నిరూపితం అయ్యాయన్నారు. అయినప్పటికీ వ్యవసాయంలో సుస్థిరత సాధించామన్నారు. వ్యవసాయంలో 1.28 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం గత నాలుగేళ్లలో సాధించామన్నారు. 97 శాతం మేర వృద్ధి సాధించామన్నారు.
రైతులకు రెట్టింపు ఆదాయం అని కేంద్రం చెబుతున్నప్పటికీ సాధించలేకపోయారన్నారు. రాష్ట్రంలో అది చేసి చూపించామన్నారు. నదుల అనుసంధానం, మైక్రో ఇరిగేషన్, సంప్రదాయ వ్యవసాయం నుంచి ఉద్యాన రంగానికి మార్పు, భూగర్భ జలాల పెంపు వంటి చర్యలు ఫలితాలను ఇచ్చాయన్నారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడుకోవాలని, లేకుంటే ఇతర రంగాలపై ప్రభావం పడుతుందన్నారు. 62 ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టామని, వాటిని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తలసరి ఆదాయం గత నాలుగు సంవత్సరాల్లో 82వేల
రూపాయల నుంచి 1.42 లక్షల రూపాయలకు
పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా 40వేల రూపాయల మేర వెనుకబడి ఉన్నామన్నారు. వృద్ధిరేటు మొదటి త్రైమాసికంలో 11.25 ఉండగా, దానిని 15 శాతానికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రంగాల్లో కేంద్రం కంటే రాష్ట్రం వృద్ధిరేటులో ముందుందని గుర్తుచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందుండటంతో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నామన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతి అందమైన నగరాలుగా అభివృద్ధి చెందాయన్నారు. పరిశుభ్ర నగరాలుగా 3 ఎంపికయ్యాయన్నారు. ఉత్తమ గ్రామాలుగా 128లో రాష్ట్రం నుంచి 30 ఎన్నికయ్యాయని, ఈ ఏడాది సగం రాష్ట్రానికి చెందినవే ఉంటాయన్నారు. సంక్షేమానికి 62వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. నీటి పారుదల రంగంపై మరో 68వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 80వేల కోట్ల రూపాయలతో 25లక్షల ఇళ్ళను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేనని తెలిపారు. ఇప్పటికే 8లక్షల గృహ ప్రవేశాలు చేశామని వెల్లడించారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వయాడక్ట్ అనే విధానం తారకమంత్రం కానుందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి వివిధ రంగాల్లో మొదటి స్థానంలో ఏపీని ఉంచారన్నారు. 2029 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రూపొందిచాలన్నది లక్ష్యమన్నారు. ప్రస్తుతం 8లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు. 11 సంవత్సరాల్లో 7రెట్ల మేర ఎకానమీని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది అసాధ్యం కాదని స్పష్టం చేశారు. మరో 20లక్షల ఎకరాల భూమిని వినియోగం తీసుకొస్తామన్నారు. ఎంప్లాయబిలిటీలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సముద్ర సంపదను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాలుగా రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని స్పష్టం చేశారు. విమానాశ్రయాల పరిసరాలను పచ్చదనంతో అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తిరుపతి విమానాశ్రయం వద్ద కోటి రూపాయల ఖర్చుతో పచ్చదనాన్ని నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. కేంద్రం ఇందుకు నిధులు ఇవ్వకపోయినా బాధ్యతగా తీసుకుని ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతలకు, ఇతరులకు తాను సవాల్ చేస్తున్నానని, నాలుగేళ్లలో 22వేల కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించిన రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. వీధి దీపాలకు ఎల్‌ఈడీ లైట్లు, ఇంటి నుంచి చెత్త, పేడ సేకరణ వంటివి ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.