రాష్ట్రీయం

రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఏపీలో విద్యుత్ స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు కానున్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి ఏపీఈపీడీసీఎల్ నుంచే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఇక్కడి యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీటిని నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) యాజమాన్యం వినియోగదారులకు అందివ్వనుంది. వినియోగదారులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా సంస్థ యాజమాన్యమే భరించనుంది. వినియోగదారుడు కోరకుండానే భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని వీటిని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తారు. వచ్చే నెల నుంచి సంస్థ పరిధిలోకి వచ్చే ముఖ్యమైన పట్టణాల్లో వీటిని మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం తొలుత విశాఖ నగరంలో కనీసం పదివేల మీటర్లను యుద్ధప్రాతిపదికన అమరుస్తారు. తొలి దశలో మూడు లక్షల మీటర్లను మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 58 లక్షలకు పైగానే విద్యుత్ వినియోగదారులున్నారు. వీటన్నింటినీ ఒకేసారి మార్చడం సాధ్యం కానందున విద్యుత్ వాడకం ఎక్కువుగా ఉండే, ప్రయోజనాలు కలిగించే పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వినియోగదారుల విద్యుత్ మీటర్‌కు సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అనుసంధానిస్తారు. ఈ విధంగా అనుసంధానించే విధానం ద్వారా విద్యుత్ వాడకాన్ని సులభంగా తెలుసుకునే అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానాన్ని సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల వినియోగదారునికి కేటాయించిన విద్యుత్ వాడకం దాటితే తక్షణమే అదనపు
వాడకానికి బ్రేక్ పడుతుంది. అలాగే నెలల తరబడి బిల్లులు చెల్లించకపోయినా, మొండి బకాయిలు ఉన్నా కార్పొరేట్ సంస్థ నుంచే కనెక్షన్‌ను తొలగించడం ఇక నుంచి సులభతరం కానుంది. మూడు కిలోవాట్ల విద్యుత్‌కు బదులు ఐదు కిలోవాట్లను వాడితే దీనిని గుర్తించిన యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుంటుంది. ఈ రెండింటితోపాటు అనేక రూపాల్లో జరిగే విద్యుత్ చౌర్యం, విద్యుత్‌ను వృధా చేయడం, సాంకేతికపరమైన సమస్యలకు ఏ విధంగా అవకాశాలుండవు. కాగా ఒక్కో స్మార్ట్‌మీటర్‌కు రెండు వేలకు పైగానే సంస్థ వెచ్చించనుంది.