రాష్ట్రీయం

పారాహుషార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణలో శుక్రవారం నాటి పోలింగ్ కోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరిస్తున్నట్టు అడిషనల్ డీజీ (శాంతిభద్రతలు) జితేంద్ర వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా హైఅలర్ట్ ప్రకటించామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అదనపుబలగాలను రప్పించామని ఆయన తెలిపారు. తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద జవాన్లతో గస్తీ పెంచామని జితేంద్ర చెప్పారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే హుటాహుటిన అక్కడికి వెళ్లడానికి హెలీకాప్టర్లును అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటువేయాలని, దానికి అనువైన వాతావరణం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని, అవసరమైతే స్థానిక పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని ఏడీజీ విజ్ఞప్తి చేశారు. మూడు నెలల నుంచి ఎన్నికల బందోబస్తుపై కసరత్తు చేశామని ఆయన అన్నారు. బలగాలకు వివిధ అంశాలపై శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు.
కాగా హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఎనిమిది నియోజక వర్గాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించామని ఆయన ప్రకటించారు. స్థానికంగా ఓ రాజకీయ పార్టీ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పాతబస్తీపై ప్రత్యేక దృష్టి సారించారు. పాతబస్తీలో 2,863 మందిపై కేసులు నమోదు చేశారు. వారిని బైండోవర్ కింద అరెస్టు చేశామన్నారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాతబస్తీలో తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కోడ్ ఉల్లంఘించినట్టు పోలీస్ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని జితేంద్ర పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కూకట్‌పల్లి నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థిని సుహాసినీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బయట వ్యక్తులు మకాం వేశారని, వారిపై కేసులు నమోదు చేశారా? అన్న ప్రశ్నకు కొందరిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. జంట నగరాలల్లో బయట వ్యక్తులు పోలింగ్ రోజున ఎక్కడైనా కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతుదార్లు ఓటర్లుకు నగదు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారని చెప్పారు. ఎన్నికల నోటిపికేషన్ విడుదలైన్పటి నుంచి ఈనెల 6 వరకూ రాష్ట్రంలో రూ.128 కోట్లును స్వాధీనం చేసుకున్నామని
వివరించారు. ఉత్తర తెలంగాణ దండకారణ్యంలో మావోయిస్టు కోసం ఆక్టోపస్ జవాన్లు కూంబింగ్ చేస్తున్నారని చెప్పారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో
సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందని అన్నారు. అభ్యర్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి వెళ్ళే సమయంలో అదనపుగన్‌మెన్‌లను వెంట తీసుకుపోవాలని ఆయన సూచించారు.