రాష్ట్రీయం

పోలింగ్‌కు సర్వం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6 : తెలంగాణ శాసనసభకు శుక్రవారం జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 119 శాసనసభా నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్టవ్య్రాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ను పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రంలో లైన్లలో నిలబడే ఓటర్లకు
స్లిప్పులు ఇస్తారు. స్లిప్పులు తీసుకున్నవారు లైన్లలో నిలబడి ఎన్నిగంటలకు పోలింగ్ పూర్తయినా ఓటు వేసే అవకాశం ఉంటుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రం గేట్‌లోపలికి ఎవరినీ అనుమతించరు. ఫోటోతో ఉన్న ఓటర్ కార్డు లేకపోతే ఓటర్‌పేరుతో ఉన్న స్లిప్పులను తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లవచ్చు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి, ఎపిక్ లేని వారు బ్యాంక్‌పాస్‌పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్‌లతో సహా 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తీసుకువెళ్లవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు తమ ఓటు వేయడాన్ని ‘డ్యూటీ’గా భావించి ఓటు వేయాలని సీఈఓ డాక్టర్ రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం, ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ గత మూడు నెలలుగా కష్టపడ్డదని గుర్తు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో డ్యూటీపడ్డ సిబ్బంది గురువారం రాత్రివరకే ఆ యా కేంద్రాలకు ఈవీఎం, వీవీ ప్యాట్లతో పాటు చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, నగరాలు, పట్టణాల్లోని 24,034 ప్రాంతాల్లో 32,812 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ను వాడుతున్నారు. ఓటరు తన ఓటు ఈవీఎంలలో వేసిన తర్వాత ఎవరికి పోల్ అయిందో చూసుకునేందుకు ఓటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీ ప్యాట్) లను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు చాలా సున్నితమైనవే కాకుండా చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. 44,415 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. మరో 7,557 రిజర్వ్‌లో ఉంచుతున్నారు. అలాగే 32,016 కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ, 4432 కంట్రోల్ యూనిట్లను రిజర్వ్‌లో ఉంచుతున్నారు. 32,016 వీవీ ప్యాట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల నిర్వహణకు 31 టీంలను 238 ఇంజనీర్లతో 31 టీంలను ఏర్పాటు చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ), ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు క్లరికల్ స్ట్ఫా ఉంటారు.
దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి
దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. కాళ్లు లేనివారు, నడవలేని వారు ఇతర దివ్యాంగులను వారి వారి ఇళ్లనుండి పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి దివ్యాంగులను రిక్షాల్లో తీసుకువెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేశారు. వికలాంగులు ఓటు వేసిన తర్వాత బయటకు తీసుకువచ్చేందుకు కూడా ఈ రిక్షాలనే వాడుతున్నారు. అంధులు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులకు చేయూత ఇచ్చేందుకు సుమారు ముప్పైవేల మంది స్వచ్చంద సేవా కార్యకర్తలను ఏర్పాటు చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్వహణకు టెక్నికల్, ఇంజనీరింగ్ విద్యార్థులు, అభ్యర్థుల సేవలు వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రతి క్షణం ఏం జరుగుతుందో వెబ్‌ద్వారా రికార్డవుతుంది. జిల్లా ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల కార్యాలయం అధికారులు, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తమ తమ కార్యాలయాల్లోని మానిటర్లలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న పోలింగ్‌ను చూసేందుకు వీలు కల్పించారు.
పోలింగ్ కేంద్రంలో ఓటర్లు వేచి ఉండాల్సి వస్తే వారు కూర్చునేందుకు గదులు, షామియానాలను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించారు.
నిరంతర నిఘా
పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 446 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, 448 ఎస్‌ఎస్‌టీ (స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు) లను, 126 సహాయ వ్యవసాయ పరిశీలకులను (ఏఈఓ), 224 వీఎస్‌టీలను (వీడియో నిఘా బృందాలు), 123 ఏటీఆర్ (అకౌంటింగ్ టీంలు) వినియోగిస్తున్నారు.