తెలంగాణ

అబ్బో..డబ్బే డబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అంచనాలకు మించి నోట్ల కట్టలు పట్టుబడుతున్న వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నడూ లేనంతగా పట్టుబడుతున్న కరెన్సీ కట్టల వార్తలు ప్రచార మాధ్యమాలు, సోషియల్ మీడియాకు హాట్‌కేకుల్లా మారాయి. ప్రజలు టీవీల ముందు వాలిపోయి ఈ ధన ప్రవాహంపైనే చర్చించుకుంటున్నారు. జాతీయ రహదార్లపై నిఘా, తనిఖీలు పెరగడంతో నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా రైళ్లు, బస్సులను ఎంచుకుంటున్నారు.
మరోవైపు ఈ నల్లధన తరలింపునకు ప్రత్యేకంగా వాహనాలను తయారు చేయించుకున్న తీరు సామాన్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. గత రెండు నెలలు నుంచి జంటనగరాల్లో పోలీసు తనిఖీల్లో పట్టబడిన సొమ్ము దాదాపు రూ.30 కోట్లకు పైచిలుకే ఉంది. దీనికితోడు లక్షల లీటర్ల మద్యంతో పాటు బంగారం ఆభరణాలు పోలీసుల స్వాధీనమయ్యాయి. ఒకవైపు రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ రకాలుగా వ్యూహాలు పన్ని నగదు తరలిస్తున్నా అధికారులు దీటైన ప్రతివ్యూహంతో అడ్డుకట్టవేయడం అంతటా ఆసక్తికరంగా మారింది. జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి లక్షలు, కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. వ్యూహం బెడిసికొట్టి పట్టుబడి ప్రతిష్టకు భంగం కలగడంతో అభ్యర్థులు బిక్కమొహం వేస్తున్నారు. తమ పేర్లు ఎక్కడ బయట పడుతాయోనని అగ్రనేతలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరోవైపుదేశంలోని ఇతర ప్రాంతలకు కమిషన్ పద్ధతిలో నగదు తరలిస్తున్న హవాలా ఏజెంట్ల గుట్టురట్టవుతోంది. ఎలాంటి ఆధారాలూ లేకుండా 6 నుంచి 7 శాతం కమిషన్ పద్ధతిలో కోట్లాది రూపాయలు హవాలా మార్గంలో తరలిస్తున్నారు. ఇలాంటి వారు తనిఖీల్లో ఇక పట్టుబడక తప్పదని తేలితే కేసులు, కోర్టులు అంటూ పోలీసులు వేధింపులు ఉంటాయన్న భయంతో నగదు మూటలను ఎక్కడికక్కడ వదిలేసి ఉడాయిస్తున్నారు. హవాలా వ్యాపారంలో అంతర్జాతీయ ముఠాలు ఉన్నందున భారీగా నోట్లకట్టలు బయటపడుతున్నాయి. తెలంగాణలో కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ.120 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.