ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి నాబార్డు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 27: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరూ ఎటువంటి అనుమానాలకు తావివ్వవద్దని, ఈప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ఈప్రాజెక్టుకు నిధులు మంజూరు అవుతాయని, అలాగే దశలవారీగా ఈ నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించిన మంత్రి సీతారామన్ తిరుగుప్రయాణంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం ఏలూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై మంత్రి మాట్లాడుతూ ఈప్రాజెక్టు నిర్మాణానికి దశలు, అవసరాల వారీగా నిధుల మంజూరు జరుగుతుందని స్పష్టంచేశారు. ఏ ప్రాజెక్టుకు ఒకేసారి మొత్తం నిధులు ఇవ్వటం సహజంగా జరగదని, పోలవరం విషయంలోనూ అవసరం, ఖర్చు బట్టి నిధులు మంజూరవుతాయన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ఎంత ఖర్చయినా కేంద్రం భరిస్తుందని అన్నారు. నూటికి నూరుశాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని, దీనిపై అనుమానాలకు, అపోహలకు తావులేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ కేంద్రం కంకణబద్దమై ఉందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనిలోభాగంగానే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తన దత్తత గ్రామాలైన తూర్పుతాళ్లు, పెదమైనవానిలంకలను ఆగస్టునాటికి పూర్తి సోలార్ విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వేల కుటుంబాలకు సంబంధించిన కొల్లేరు అభయారణ్యం విషయంలోనూ కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని అన్నారు.

చిత్రం దత్తత గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్