రాష్ట్రీయం

జోరుగా బెట్టింగ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, డిసెంబర్ 8: విలక్షణ తీర్పులకు నిలయమైన కల్వకుర్తి అసెంబ్లీ స్థానం ఎవ్వరికో దక్కునుందోనని సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఈ దఫా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి 15మంది బరిలో ఉన్నా ప్రధానంగా టీఅర్‌ఎస్ అభ్యర్థి గూర్క జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజి ఆచారిల మధ్యే పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఎన్నికల పోలింగ్ సమరంలో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి ఘటన మినహ ప్రశాంతవారణంలో ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 83.87శాతం ఓటర్లు ఓటు హక్కును వినియెగించుకోగా, ఈదఫా ఎన్నికల్లో ఓక్క అడుగు ముందుకేసి 86.71శాతం ఓటు హక్కును వినియెగించుకున్నారు. శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలీంగ్ సరళిపై అభ్యర్థుల గెలపు ఓటమిలపై ఎక్కడ చూసిన లెక్కలు వేస్తు కన్పిస్తున్నారు. అంతటితో అగకుండ గెలుపుపై ధీమాతో ఆయా పార్టీలకు చెందిన చోటా మోటా నాయకులు బెట్టింగ్, సవాల్, ప్రతిసవాల్‌కు దిగుతున్నారు. ముఖ్యంగా జైపాల్‌యాదవ్, ఆచారి, వంశీచంద్‌రెడ్డిల మధ్య ముక్కోణపు పోటీ జరిగిందని పార్టీ విశే్లషకులు భావిస్తున్నారు. వారి అనుచర గణం ఎవ్వరికి వారే తామే గెలుస్తామంటే తామే గెలుస్తామంటూ అంచనాలు వేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఎన్నికల పోలింగ్ సరిళితో పాటు గెలుపు ఓటమిలపై జోరుగా చర్చోపచర్చలుగా కొనసాగుతున్నాయ. గ్రామాల్లోని పోలింగ్ సరళిని తీసుకుంటూ ఎంతమేర ఓట్లు తమకు లాభిస్తాయనే అంచనాలు వేయడంతో ఆయా పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు టీఅర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను గట్టిక్కెస్తాయని, నాలుగు సార్లు ఓటమి పాలైనందున సానుభూతి పవనాలు పనిచేసి బీజేపీ అభ్యర్థి ఆచారికి ప్రజలు పట్టాం కడుతారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తాయని ఆయా పార్టీల నాయకులు చర్చించుకుంటు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కుంపునకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో ఓట్ల పర్సంటేజీలపై అంచనాలు వేయడం మొదలు పెట్టారు. ఈ బెట్టింగులకు, ఉత్కంఠకు మరో రెండు రోజులు వేచి ఉంటే ఓటరు సర్వే బయల్వడుతుంది. ఈ నియోజకవర్గ ఓటర్లు ఎవరికి కట్టనున్నారో తెలిసిపోతుంది.