రాష్ట్రీయం

కూటమికే ప్రజాదరణ : రావుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సమాజం యావత్తూ ప్రజాఫ్రంట్ వైపే మొగ్గుచూపిందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత స్ఫష్టంగా కనిపించిందని చెప్పారు. శనివారం ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖరరెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం, అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం అంతా చంద్రబాబు నాయుడుపై దూషణలతోనే సాగిందని విమర్శించారు. బాబును తిట్టడం ద్వారా ఓటర్లను టీఆర్‌ఎస్‌వైపుతిప్పుకోవాలనిన చూశారని, అయితే ప్రజలు తిరస్కరించారని టీడీపీ నేతలు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌పోల్ సర్వేలను చూసి టీడీపీ కుంగిపోవడం లేదా పొంగిపోవడం లేదని రావుల అన్నారు. జాతీయ మీడియా సర్వేలు చూస్తుంటే ‘నా సర్వేలు నా ఇష్టం అన్నట్లుగా ఉన్నాయి’అని ఆయన విమర్శించారు. తమ వైపు ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ప్రజాఫ్రంట్ గుర్తించిందని చెప్పారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన సమయంలో ప్రతిపక్షాల్లో ఎన్నికలను ఎదుర్కొనే సత్తాకనిపించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే విపక్షాలన్ని కూటమిగా ఏర్పాడ్డాక పరిస్థితి మారిపోయిందని, ఇలా జరుగుతుందని సీఎం ఊహించలేదని టీడీపీ నేత అన్నారు. ప్రజాఫ్రంట్‌కు సకల జనులు మద్దతు తెలిపారని, ఇలా ఉంటుందని తాము కూడా తొలుత ఊహించలేదని చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. సీఎం నియంతృత్వ పాలన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో ప్రజాఫ్రంట్ విజయం సాధించిందని వెల్లడించారు. చంద్రబాబును లక్ష్యంగా టీఆర్‌ఎస్ చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. కాగా ఎన్నికల సంఘానికి టీడీపీ 26 ఫిర్యాదులు చేస్తే స్పందనేలేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. సమయాభావంతో ఓటర్ల లిస్టులో తప్పులు జరిగాయని ఈసీ అధికారులు కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. పట్టణాల్లో ఓట్ల శాతం తగ్గిపోవడానికి కారణాలను వెతకాలన్నారు. రానున్న రోజుల్లో పట్టణాల్లో ఓట్ల శాతం పెరగడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. ప్రజాఫ్రంట్‌కు టీడీపీ కేడర్ ఓటు పూర్తిస్థాయిలో బదిలీ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తొమ్మిది నెలల ముందే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందీ కేసీఆర్ చెప్పలేకపోయారని రావులు ఎద్దేవా చేశారు. ఏవో కుంటిసాకులు చెప్పడం మినహా అంతకు మించి బలమైన కారణాన్ని సీఎం వివరించలేక పోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి పోలింగ్‌లోకి దూసుకుపోవడం దారుణమన్నారు. కాగా తెలంగాణలో టీడీపీ లేదని టీఆర్‌ఎస్ చేసిన ప్రచారాన్ని తమ అధినేత చంద్రబాబు తిప్పికొట్టారని అన్నారు.