రాష్ట్రీయం

మోదీతో మరోసారి ఢీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను స్తంభింప చేసేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, ప్రత్యేక రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం, భోగాపురం విమానాశ్రయం, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ గత సమావేశాల్లో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ, ఈసారి సమావేశాల్లో తీవ్రస్థాయి ఆందోళన నిర్వహించాలని భావిస్తోంది. గత సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో టీడీపీ ఎంపీలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులను ప్రశ్నించటంతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై కలిసొచ్చే పార్టీలతో కలిసి ఉద్యమించేందుకు టీడీపీ సమాయత్తవౌతోంది. ఇందులోభాగంగా సోమవారం ఢిల్లీలో జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ యేతర ప్రతిపక్ష పార్టీల నేతలతో తొలిసారిగా నిర్వహించే సమావేశానికంటే ముందుగా పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను సభలో వినిపించటం ద్వారా దేశ ప్రజలకు తగిన సంకేతాలు పంపాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు
నేతృత్వంలో జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో యూపీఏ హయాంలో బోఫోర్స్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్‌పై స్పందించి అప్పట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు 125 మంది మూకుమ్మడి రాజీనామాలు చేసిన తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీపై వచ్చిన రాఫెల్ అభియోగాలపై సభలో గొంతు వినిపించడం ద్వారా బీజేపీ యేతర పార్టీల ఎంపీలను కూడగట్టి మూకుమ్మడి రాజీనామాలు చేయటం ద్వారా ఎన్డీఏ విధానాలను ప్రజలకు వివరించాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా నెలరోజుల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కుదిపివేసిన తిత్లీ తుపాను బాధితులకు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించక పోవటంపై ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి నిలదీయాలని భావిస్తున్నారు. ఏపీ పట్ల వివక్ష చూపటంతో పాటు రాజకీయ వేధింపుల్లో భాగంగా ఎంపీలు సుజనాచౌదరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీఎం రమేష్, టీడీపీ ఇతర నేతలు, ఎమ్మెల్యేలపై ఐటీతో దాడులు చేయించటంపై సభలో ప్రశ్నించాలని పార్టీ భావిస్తోంది. కేంద్రం వంచనపై రాష్ట్రంలో నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షలు, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ ఐక్యఫ్రంట్ అజెండాపై పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ నేతల సమావేశంలో చర్చించనున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఈసారి ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.