తెలంగాణ

భారత్ మాతాకీ జై అనడం గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: విదేశీయులు సైతం భారతీయ సంస్కృతిని గౌరవించి జేజేలు పలుకుతుంటే, ఈ దేశంలో ఉంటూ భారత్‌మాతాకు జై..అని అనను అనే వారిని ఏమనాలని, జన్మనిచ్చిన తల్లిని అమ్మా అని పిలవను అనే మూర్ఖులను ఏమనగలమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. అమ్మను ఆరాధించవద్దని ఏ మతం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. పరదేశీ వ్యామోహం ఎక్కువై ఓటు బ్యాంకు రాజకీయాలొచ్చాయి..దురదృష్ణవశాత్తు రాజకీయ ముసుగులో మనల్ని మనమే కించపరచుకుంటున్నామంటూ దేశమంటే మనుషులోయ్..అని గురజాడ మాటలను వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. కినె్న ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రవాస భారతి గ్రంథావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. సైనికులు ప్రాణ త్యాగాలు చేస్తూ మనల్ని కాపాడుతుంటే..అలాంటి త్యాగాలను మరచిపోయి మతాన్ని రాజకీయం పులిమి కించపరచవద్దని సూచించారు. ప్రధాని మోదీ కొత్తగా ఏమీ చేయడం లేదని, వాటినే బయటకు తీసి అందరికీ తెలిసేలా, అందుబాటులో ఉండేలా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన భారతదేశాన్ని మరవకుండా ప్రవాస భారతి గ్రంథాన్ని తెలుగు నేలపై ఆవిష్కరింపజేసిన డాక్టర్ ఎస్ రాఘవేంద్ర ప్రసాద్‌ను ఆయన అభినందించారు. కక్షలు, స్వార్థరాజకీయాలు మాని అవినీతి రహిత, శక్తివంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకుందామని వెంకయ్యనాయుడు కోరారు. మనల్ని మనం అగౌరవ పరచుకునే పరిస్థితులను తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వృత్తుల వల్ల కులాలు ఏర్పడ్డాయని, దురదృష్టవశాత్తు విశ్వవిద్యాలయాల్లో కూడా వికృత కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు.