రాష్ట్రీయం

మనమే గెలుస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘మనమే గెలుస్తున్నాం. ఇది పక్కా సమాచారం. అన్ని జిల్లాలోనూ ప్రజాకూటమికే ఎక్కువ సీట్లు దక్కబోతున్నాయి’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం 80 సీట్లను ప్రజాకూటమి గెలువబోతుందని అన్నారు. ప్రచారానికి తక్కువ వ్యవధి ఉండటం, కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగినప్పటికీ ప్రజలను ప్రజాకూటమి వైపు తిప్పుకోవడంలో సఫలికృతం అయినట్టేనని అన్నారు. టీఆర్‌ఎస్ కోట్లు గుమ్మరించి, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ప్రజలు మాత్రం కూటమి వైపే నిలిచారన్నారు. పోలింగ్ జరిగిన తీరుపై విశే్లషణతో పాటు ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం సాయంత్రం ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, సీనియర్ నేతలు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదరం రాజనరసింహా, అజహరుద్దీన్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, సీపీఐ నేత చాడా వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేకపోవడంతో మరేదైనా కుట్ర చేసే
అవకాశం లేకపోలేదని కూటమి నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కౌంటింగ్ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి పక్షాలన్ని తమ ఏజెంట్లను అప్రమత్తం చేయాలని సమావేశం నిర్ణయించినట్టు తెలిసింది. కూటమి పక్షాల నేతలు అభ్యర్థులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు, జాగ్రత్తలను తెలియజేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అవసరమైతే ఎంఐఎం సహకారం కూడా?
ఇలా ఉండగా కూటమి నేతల మధ్య జరిగిన చర్చల్లో ఎంఐఎం వైఖరిపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే ఎంఐఎం సహకరించడానికి కూడా సముఖంగా ఉన్నట్టు ఒక నాయకుడు వెల్లడించినట్టు తెలిసింది. ఎంఐఎంతో ఇప్పటికే ఏఐసిసి నేత ఒకరు టచ్‌లో ఉన్నారని, అవసరమయ్యే పక్షంలో తప్పకుండా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక నాయకుడు వివరించినట్టు తెలిసింది. ఢిల్లీ స్థాయిలోనే ఎంఐఎంతో చర్చలు జరుగుతున్నాయని, ఆ విషయాన్ని ఏఐసిసికి వదిలేద్దమని మరొక నాయకుడు సూచించినట్టు తెలిసింది. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు ఉన్న లోపాయికారి సంబంధాల పట్ల ఎంఐఎం అసంతృప్తిగా ఉందని, వారిని కూటమివైపు తిప్పుకోవడానికి పెద్ద సమస్యేమి కాదని మరొక నాయకుడు అభిప్రాయపడినట్టు తెలిసింది.
చిత్రం..పోలింగ్‌పై విశే్లషణ జరిపేందుకు సమావేశమైన కూటమి నేతలు కుంతియా, ఉత్తమ్, రమణ తదితరులు