రాష్ట్రీయం

సర్వభూపాల, గరుడ వాహనాలపై కల్పవల్లి విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 9: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై గాన గంధర్వ శాప విమోచన శ్రీకృష్ణుని అలంకారంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ కొనసాగింది. అడుగడుగునా భక్తులు అమ్మవారికి నారికేళం, కర్పూర హారతులు సమర్పించుకున్నారు. శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన సర్వభూపాల వాహనంపై విశేషాలంకార భూషితురాలైన అమ్మవారు కొలువుదీరి వస్తుంటే మాడవీధుల్లోని భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. అమ్మవారి చూపు తమపై పడాలని తపించారు.
స్వర్ణరథంపై మెరిసిన మహాలక్ష్మి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4.10 నుంచి 5 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగారు. సర్వ సంపదలకు నిలయమైన మహాలక్ష్మి స్వర్ణరథంపై కొలువుదీరిన వేళ, రథాన్ని లాగేందుకు అధికారులు, భక్తులు, ప్రజలు పోటీ పడ్డారు. గోవింద నామస్మరణలతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.
గరుడ వాహనంపై లోకమాత విహారం
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8 నుంచి 11 గంటల వరకు లోకమాత పద్మావతీ అమ్మవారు గరుడ వాహనంపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి వాహన సేవల్లో గజ వాహనానికి ఎంత ప్రాధాన్యత ఉందో గరుడ వాహనానికి అంతే ప్రాధాన్యత ఉంది. గరుడ వాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుంటే సర్వ సుఖాలు లభిస్తాయని, యోగపరంగా పురోగతి లభిస్తుందని భక్తుల నమ్మకం. గరుడుడు నిత్య సూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు విశ్వసిస్తారు. శ్రీవారిని, అమ్మవారిని నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా పలురకాలుగా సేవిస్తారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీనివాసుడు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలు మంగమ్మను దర్శించడానికి వచ్చిన భక్తులతో నాలుగు మాడవీధులు కిక్కిరిసిపోయాయి. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ పోల భాస్కర్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారు