రాష్ట్రీయం

మైనారిటీల సంక్షేమంలో నవశకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 9: సమాజంలో అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమంలో నవశకానికి నాంది పలికింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనార్టీ వర్గాలను రాజకీయం, ఆర్థికం, సామాజికంగా అభివృద్ధి చేయటం కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతికి ఎప్పటికప్పుడు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్న ప్రభుత్వం వారికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక భరోసా కల్పిస్తోంది. అన్ని రంగాల్లో ముస్లింల అభ్యున్నతిని కాంక్షించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి అభివృద్ధికి దోహదపడే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 8.8 శాతంగా ఉన్న ముస్లింల కోసం ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు రూపొందించింది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు వారి సంక్షేమం కోసం రూ. 2679 కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద ఖర్చు చేసింది. ఇదే సమయంలో 2018-19 సంవత్సరానికి సంబంధించి మరో రూ.1101 కోట్లను ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ రూపొందించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలోని మసీదుల్లో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇమామ్‌లకు నెలకు 5వేల రూపాయలు, వౌజమ్‌లకు 3వేల రూపాయలు అందజేస్తూ ముస్లింల పట్ల చంద్రబాబు తన అభిమానాన్ని చాటుకున్నారు. 1,458 షాదీఖానాల కోసం రూ. 221 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. 2018-19 సంవత్సరానికి షాదీఖానాల నిర్మాణానికి మరో 20కోట్ల నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. మసీదుల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 20కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి మరో 20కోట్లు కేటాయించడంతో పాటు మసీదుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. ప్రతీ ఏడాది ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ పర్వదినం సందర్భంగా చంద్రన్న రంజాన్ తోఫాను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం 65 కోట్ల రూపాయలను 12లక్షల మంది ముస్లింల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దుల్హన్ పథకంలో భాగంగా చంద్రన్న పెళ్లి కానుకగా ముస్లిం యువతీ యువకులకు రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. 2015 నుండి అందిస్తున్న ఈ పథకంలో భాగంగా ప్రతీ ఏడాది సుమారు 17వేల మంది ముస్లిం యువతీ, యువకులు లబ్ధి పొందుతున్నారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి 11,921 మందికి ఇప్పటికే దుల్హన్ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. 2018-19 సంవత్సరానికి 16వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారందరికీ రూ.50 వేల చొప్పున అందించింది. ముస్లిం విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా 20వేల మంది ముస్లిం విద్యార్థులకు రూ. 812 కోట్లను పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లుగా అందించింది. 2018-19 సంవత్సరానికి లక్షా 35వేల మంది ముస్లిం విద్యార్థులకు 285 కోట్ల రూపాయలను పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లుగా అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు 1.41 లక్షల మంది విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిష్‌ల కోసం రూ.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇక ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన, నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 20కోట్లు అందించింది. 2016-17 సంవత్సరానికి 95 మంది విద్యార్థులకు 4.75 కోట్లు విదేశీ విద్య కోసం ప్రభుత్వం అందించింది. 2018-19 నుండి విద్యార్థుల నుండి వస్తున్న సూచనల్లో భాగంగా వారికి అందించే ఆర్థిక సహాయం 10లక్షల నుండి 15లక్షలకు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 300 మంది విద్యార్థుల కోసం సుమారు 30కోట్ల ప్రత్యేక నిధలను ప్రభుత్వ సిద్ధం చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో భాగంగా రూ. 750 కోట్లతో కర్నూలు, గుంటూరు, విశాఖలో ముస్లిం విద్యార్థులకు ప్రభుత్వం శిక్షణ అందిస్తోంది. 2018-19లో మరో 300 మందికి శిక్షణ కల్పించేందుకు మరో 6కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందించనుంది. ఈ నిధుల ద్వారా ప్రతి సంవత్సరం 300 మంది విద్యార్థులు ప్రొఫెషనల్ గైడెన్స్ అందుకుంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుకోనున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాల ద్వారా 2014-15 సంవత్సరాల మధ్య 23,251 మంది లబ్ధిదారులకు రూ. 162 కోట్లు ప్రభుత్వం అందించింది. 2018-19లో మరో 11 వేల మంది లబ్ధిదారులకు సహాయం అందించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా నిధులను సమకూర్చుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ పథకం ద్వారా గత నాలుగేళ్ల కాలంలో 8040 మంది యువకులకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించగా, 2018-19 సంవత్సరానికి మరో 9వేల మంది ముస్లిం యువతకు శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా 2019లో గన్నవరం విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ స్టాటస్‌ను ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే కడపలో హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుండగా ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 12కోట్లు కేటాయించింది. దీంతోపాటు విజయవాడలో కూడా రూ. 80 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది.
రాజకీయంగా ప్రోత్సాహం
రాష్ట్రంలోని ముస్లింలను రాజకీయంగా పైకి తెచ్చేందుకు వారికి ఎన్నో పదవులను ప్రభుత్వం కట్టబెట్టింది. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను నియమించింది. మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా జియావుద్దీన్, ఉర్డూ అకాడమీ చైర్మన్‌గా ఎండీ నౌమాన్, శాసనమండలిలో విప్‌గా చాంద్‌బాషా, మండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని అన్నివిధాలా గౌరవించింది.