రాష్ట్రీయం

ఆంధ్రా టు హైదరాబాద్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో అందివచ్చిన వరుస సెలవుల సందర్భంగా జంటనగరాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ వాసులు తమ స్వస్థలాలకు వెళ్లి తిరిగి జంటనగరాలకు చేరుకునే క్రమంలో విజయవాడ-హైద్రాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారితో పాటు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి టోల్‌గేట్లు ఆదివారం రాత్రి ఆంధ్రవాసుల వాహనాల రద్ధీతో కిక్కిరిశాయి. కేతెపల్లి మండలం కొర్లపహాడ్, చౌటుప్పల్ మండలం పంతంగి, మాడ్గులపల్లి టోల్‌ఫ్లాజాల వద్ధ ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుండి వచ్చిన వాహనాల రద్ధీతో నిండిపోగా టోల్‌ఫ్లాజా సిబ్బంది అదనపు గేట్లను ఏర్పాటు చేసి రద్దీని క్రమబద్ధీకరించారు. ఐనప్పటికి ఆకస్మిక రద్ధీతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలాల్సివచ్చింది. విజయవాడ నుండి కేతెపల్లి టోల్‌ఫ్లాజా మీదుగా వచ్చిన వాహనాలతో పాటు ఇటు గుంటూరు నుండి అద్దంకి-నార్కట్‌పల్లి మాడ్గులపల్లి టోల్‌ఫ్లాజా నుండి వచ్చిన వాహనాల రద్ధీతో చౌటుప్పల్ పంతంగి టోల్‌ఫ్లాజా వద్ధ వందల సంఖ్యలో వాహనాల రద్ధీ పెరిగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక పోలీసులు, టోల్‌ఫ్లాజా సిబ్బంది రద్ధీ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో కొంత ఆలస్యంగానైనా వాహనాలు హైద్రాబాద్ వైపు కదిలాయి.