రాష్ట్రీయం

రిజర్వేషన్లు తగ్గించ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించరాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణయ్య సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటే ఎస్‌సీ, ఎస్‌టీలకు కలిపి 28 శాతం పోతే, మిగిలేది 20 శాతమే అవుతుందని కృష్ణయ్య సీఎస్‌కు వివరించారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడం అన్యాయమే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి బీసీ రిజర్వేషన్లను తగ్గించరాదని ఆయన సీఎస్‌ను కోరారు.
‘తగ్గిస్తే ఊరుకోం’
రిజర్వేషన్లు తగ్గిస్తే ఆందోళనలు చేపడతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22 శాతానికి తగ్గుతాయని ఆయన సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34 నుంచి 56 శాతానికి పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు 34 నుంచి 22 శాతానికి తగ్గించాలనుకోవడం భావ్యం కాదన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మధుసూదన్ మున్నూరు, నీల వెంకటేష్, బర్కా కృష్ణ, రాజ్‌కుమార్, జి. కృష్ణ యాదవ్, నరేష్ గౌడ్, రవి తేజ, వేల్పుల బిక్షపతి పాల్గొన్నారు.