రాష్ట్రీయం

ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీదే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితాలను పటిష్టంగా రూపొందించాలని బీజేపీ తొలి నుండి కోరుతూ వచ్చిందని, అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని అన్నారు. స్వయంగా ఎన్నికల సీఈఓ ఓట్ల గల్లంతుపై క్షమాపణ చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఘనత బీజేపీకి మాత్రమే దక్కిందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు ఫలితాల ద్వారా ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ముందస్తు ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతుందని దాదాపు అన్ని సర్వేలు సూచించాయని అన్నారు.
డబుల్ డిజిట్ సాధిస్తాం: కిషన్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ సాధిస్తుందనే ఆశతో ఉన్నట్టు బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల తర్వాత బీజేపీ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని, తెలంగాణలో పార్టీ బలపడాలని, టీఆర్‌ఎస్‌కు, మహాకూటమికి సమాంతరంగా బీజేపీ బలపడిందని అన్నారు. తాము కోరుకున్నది కూడా అదేనని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ అధిష్టానం సూచనల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, అధిష్టానం ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్‌కు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే అవకాశం, వెసులుబాటు ఉంటుందని అన్నారు.