రాష్ట్రీయం

ఇక జాతీయ రాజకీయాల్లోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలిపారు. త్వరలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావం కానున్నదని, నెల రోజుల్లో అద్భుతం చూస్తారని ఆయన చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు దేశానికి దిక్సూచీగా మారుతాయన్నారు. ఇకమీదట తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పారు. కొంత మంది డర్టీ, సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. పెసిమిస్టిక్‌గా ఉండరాదని, అప్టిమిస్టిక్‌గా ఉండాలని ఆయన అన్నారు. నాలుగు పార్టీలు ఏకం కావడం కాదని, దేశ ప్రజలను ఏకం చేయడం ముఖ్యమని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం కలిగిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో గందరగోళం నెలకొని ఉన్నదని, రాజకీయాలు స్టీరియోఫోనిక్‌గా మారాయని ఆయన విమర్శించారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పాలన రావాలని అన్నారు. కాంగ్రెస్‌కు
వ్యతిరేకంగా బీజేపీని, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను ఎన్నుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఈ దుర్గతి అని ఆయన తెలిపారు. మంగళవారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే పునరావృత్తం అయ్యిందని ఆయన చెప్పారు. డివైసివ్ పాలిటిక్స్ నుంచి దేశం బయటకు రావాలని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. ప్రతిసారి చంద్రబాబు గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ దేశానికి 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, కేవలం 30 వేల టీఎంసీలను వాడుకుంటున్నామని, ఇందులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం అవసరమని కేసీఆర్ తెలిపారు. కేవలం ఉత్పత్తిపైన మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని, ఇజ్రాయిల్ చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తేల్చుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఏమి చేయాలన్న అంశంపై విశే్లషకుడు అశోక్ గులాటి అద్భుతమైన వ్యాసం రాశారని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో రాశారని, స్వామినాథన్ కూడా తమ పథకాలను మెచ్చుకున్నారని ఆయన తెలిపారు. రైతు పెట్టుబడితో రైతులకు స్వేచ్ఛ ఇచ్చేశామని ఆయన చెప్పారు.
చైతన్యమైన గడ్డ..
తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలని అన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు, నాయకులు కాదని తెలిపారు. త్వరలో ఢిల్లీకి వెళ్ళి ఆయా పార్టీ నేతలను కలుస్తానని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేశారని, అంతిమ తీర్పు ప్రజలు ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్ శుభాకాంక్షలు చెప్పారు.