రాష్ట్రీయం

ఒకే ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేలు చిత్తయ్యాయి. అంచనాలు తారుమారయ్యాయి. ఇది ఎవరికీ అందని విజయం.. ఎవరి ఊహకూ అందని అపురూప మహోదయం. తెలంగాణ ఆవిర్భావ చరిత్రలో తెరాస అధినేత మరో చరిత్ర సృష్టించారు. ఒకే ఒక్కడుగా ఓ మహాకూటమిని మట్టికరిపించారు. ఓ రాష్ట్ర చరిత్రలో ఇన్ని పార్టీలు ఒకే నాయకుడ్ని టార్గెట్ చేయడం ఒక ఎత్తయితే...
వారందరినీ చిత్తుచేసి తన అజేయత్వాన్ని చాటుకోవడం మరో ఎత్తు. ఇది ఒక్కడికే సాధ్యం. తెలంగాణ ప్రజల ఆరాధ్యుడిగా నాలుగేళ్ల పాలనలో నీరాజనాలందుకున్న కేసీఆర్‌కే ఇది సుసాధ్యం. అందుకే తన పేరే అభ్యర్థుల విజయసోపానమైంది. పేరులేని అభ్యర్థులు సైతం దిగ్గజ నేతల్ని ఓడించారు. అదే కారు బలం.. ఆ కారు సారథి అందించిన సర్కారు బలం..
*
హైదరాబాద్, డిసెంబర్ 11: ముందస్తు ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘కారు’ దుమ్ము రేపింది. టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాలతో విజయోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్నాయి. 119 నియోజకవర్గాలకుగాను 88 నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ కైవశం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో, టీడీపీ రెండు, బీజేపీ ఒక్క స్థానం దక్కించుకోగా, ఎంఐఎం ఏడింట, ఇతరులు రెండుచోట్ల గెలిచారు. మిగిలిన పార్టీల అభ్యర్థుల కంటే అత్యధిక మెజార్టీలను సాధించి టీఆర్‌ఎస్ నేతలు అగ్రస్థానంలో నిలిచారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో పాటు కే తారకరామారావు, హరీష్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రధానంగా దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్య, జి జగదీష్‌రెడ్డి, టీ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రసమయి బాలకిషన్, ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి వంటి ప్రముఖులు విజయం సాధించారు. అయితే శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు. ప్రభంజనంలో సైతం వీరి ఓటమి పార్టీ నేతలను విస్మయపరిచింది. పాత జిల్లాల వారీ చూస్తే ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల్లో 09, హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 07, కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 స్థానాల్లో 11, ఖమ్మంలో 10 స్థానాల్లో ఒక్కటి, మెదక్‌లోని 10 స్థానాల్లో 09, మహబూబ్‌నగర్‌లోని 14 స్థానాల్లో 13, నల్గొండలోని 12 స్థానాల్లో 09, నిజామాబాద్‌లోని 09 స్థానాల్లో 08, వరంగల్‌లోని 12 స్థానాల్లో 10, రంగారెడ్డిలోని 14 స్థానాల్లో 11 తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది.
శాసనసభను రద్దు చేసింది మొదలు అన్నీ తానై అవిశ్రాంతంగా 116 సభల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు మాటల మంత్రం ఫలించింది. వెళ్లిన ప్రతి సభలోనూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా తక్షణం ప్రజల ముందున్న అంశాలపై విడమరచి, ఎలాంటి అయోమయం లేకుండా ఓట్లు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఒక్క
బక్కప్రాణిని ఎదుర్కోవడానికి ఇంతమంది కలవాలా? అంటూ ప్రజల్ని ప్రశ్నించడం ద్వారానే విపక్షాలను తుత్తినియలు చేశారు. మహాకూటమిని ఉద్దేశించి ‘కాళేశ్వరం కావాలా? శనీశ్వరం కావాలా’ అంటూ నిలదీశారు. మరో సభలో ‘్ధర్మం నిలవాలా? అధర్మం గెలవాలా?’ అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద కేసీఆర్ మాటల మంత్రం బాగానే పనిచేసింది. ఆయన రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే, విపక్షాలపై పదునైన విమర్శనాస్త్రాలను సంధించారు. చివరికి తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే నిలిచి, సీఎం కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. టీఆర్‌ఎస్ పార్టీని నెత్తిన పెట్టుకున్నారు. ఎమ్మేల్యేల పనితీరుతో సంబంధం లేకుండా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే నమ్మకం ఉంచి మరోమారు పట్టం కట్టారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల్లోని మహామహులను తెలంగాణ ప్రజలు నేలకిసిరి కొట్టారు. డిపాజిట్లను గల్లంతు చేశారు. రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, కొండా సురేఖ, జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహ లాంటి కాంగ్రెస్ ప్రముఖులతోపాటు డాక్టర్ కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్ రామచందర్‌రావు ఓటమి పాలయ్యారు. దీంతో దాదాపు బీజేపీ కనుమరుగైంది. కోదండరామ్, గద్దర్‌తోపాటు చాలా మంది కాంగ్రెస్ ప్రజాకూటమికి బాసటగా నిలిచినా కేసీఆర్‌ను ఓడించలేకపోయారు. సీఎం కేసీఆర్ మాటలను నమ్మి ప్రజలు ఓటు వేసి, ప్రజాకూటమిని మట్టికరిపించారు. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా హేమాహేమీలు రంగంలోకి దిగినా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ అభివృద్ధి పనులవైపే నిలవడం గమనార్హం.
రైతాంగానికి చేపట్టిన రైతు రుణ మాఫీ, రైతుబంధు, పంట బీమా పథకాలు, మరోపక్క మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించే ప్రయత్నం, మిషన్ కాకతీయతో ఊళ్లోని చెరువులను నింపే ప్రయత్నం, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసరా ఫించన్లు, కంటి వెలుగు, కళ్యాణ లక్ష్మి, రైతాంగానికి నిరంతర ఉచిత విద్యుత్ తదితర పథకాలు ఎన్నికల యజ్ఞంలో ఓట్లను కురిపించాయి.
ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ
కౌంటింగ్ మొదలైనప్పటి నుండి టీఆర్‌ఎస్ ప్రభంజనం వీస్తున్నా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగింది. ప్రధానంగా ముషీరాబాద్, అంబర్‌పేట, కార్వాన్, కోదాడ, తుంగతుర్తి తదితర నియోకవర్గాల ఫలితాలు చివరి నిమిషం వరకూ అటూ ఇటూ ఆధిక్యతలు మారడంతో ఉత్కంఠను రేకెత్తించాయి.
జాడలేని టీజేఎస్
తెలంగాణ ఆవిర్భావం అనంతరం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కొంటూ ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటుచేసిన టీజేఎస్ కనీసం బోణీ చేయలేదు. 9 స్థానాల్లో పోటీ చేసినా కనీసం తన స్థానాన్ని కూడా కోదండరాం నిలుపుకోలేకపోయారు. వైకాపా, జనసేన పార్టీలు ఏకంగా ఎన్నికలకు దూరంగా నిలిచిపోయాయి. సన్నద్ధత లేని కారణంగా ఎన్నికలకు దూరంగా ఉండిపోయినట్టు ఆ పార్టీలు ప్రకటించాయి.
*

88/119
*
ఫలితాలు:
టీఆర్‌ఎస్ - 88
కాంగ్రెస్ - 19
టీడీపీ - 2
ఎంఐఎం - 7
బీజేపీ - 1
ఇతరులు - 2
*
చిత్రాలు...తెలంగాణ భవన్‌వద్ద మిన్నంటిన సంబరాల్లో పాలుపంచుకున్న కేటీఆర్